ఐపీఎల్ సీజన్ 17( Ipl 17 ) లో భాగంగా ముంబై ఇండియన్స్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) తో ఆడిన మ్యాచ్ లో ఓటమిని చవి చూడాల్సిన వచ్చింది.నిజానికి ఈ మ్యాచ్ లో ముంబై గెలవాల్సి ఉన్నప్పటికీ చివర్లో హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) తో డేవిడ్ లాంటి ఫినిషర్స్ చేతులెత్తేయడం తో ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ ఓడిపోయిన కూడా రోహిత్ శర్మ( Rohit Sharma ) మాత్రం అద్భుతమైన సంచరీని సాధించి మరోసారి తన ఫామ్ ను ప్రూవ్ చేసుకున్నాడు.ఇక జూన్ లో టి20 వరల్డ్ కప్ కోసం ఆయన కెప్టెన్ గా నియామకం అయిన విషయం మనకు తెలిసిందే…ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఆయన చాలా మంచి ఫామ్ లో ఉండడం కూడా ఇండియన్ టీమ్ కి రెండు రకాలుగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఇండియన్ టీం లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా మంచి ఫామ్ లోకి రావడం అనేది టీం యొక్క బలాన్ని సూచిస్తుంది.కాబట్టి మన టీం లో ఉన్న ప్రతి ఒక ప్లేయర్ ఇప్పుడు ఫామ్ లో ఉండడం అనేది ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే ఇక మీదట జరిగే మ్యాచ్ ల్లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians )టీం తరఫున తనని ప్రూవ్ చేసుకుంటే తప్ప ఈసారి ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే లేవు.
ఇక ఈ సీజన్ లో రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసింది కూడా ఒక వంతుకు మంచి పని అయింది అంటూ హిట్ మాన్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఎందుకంటే ఆయన కెప్టెన్ గా ఉన్నప్పుడు చాలా ప్రిజర్స్ ఉండి సరిగా ఆడలేకపోయాడు.కానీ ఇప్పుడు కెప్టెన్ గా లేకపోవడం వల్ల హిట్టింగ్ చేస్తూ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడుతున్నాడు.
ఇక అందులో భాగంగానే చెన్నై మీద 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం అనేది మామూలు విషయం కాదు అంటూ వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…
.