Dhoni : ఈ ఐపిఎల్ సీజన్ లో ధోని ముందున్న పెద్ద సవాల్ ఇదే…

ప్రస్తుతం మరో నాలుగు రోజుల్లో ఐపిఎల్ సీజన్ 17( IPL Season 17 ) ప్రారంభమవుతున్న నేపథ్యంలో చెన్నై టీం ( Chennai Team )భారీ కసరత్తులను చేస్తుంది.

ఇక అందులో భాగంగానే ప్రాక్టిస్ శేషన్ లోనే ఏ ప్లేయర్ దమ్మెంటో టీమ్ యాజమాన్యం క్యాలిక్యులేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే చెన్నై టీం కెప్టెన్ అయిన మహేంద్రసింగ్ ధోని మాత్రం ప్రాక్టీసేషన్ కూడా తన సత్తా చాటుతూ 40 ఏళ్లు దాటినా కూడా 20 ఏళ్ల కుర్రాడిలా ఆడుతున్నాడు.ఇక ధోని ప్రాక్టీస్ ని చూసిన చాలామంది ఇప్పుడప్పుడే ధోని( Dhoni ) రిటైర్ అయ్యేలా కనిపించడం లేదు అంటూ కామెంట్లను కూడా చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే చెన్నై టీం ఈసారి కూడా కప్పు కొట్టడం పక్క అన్నట్టుగా బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ధోని ఈసారి టీమ్ లోకి మహేష్ తిక్షణా ను తీసుకుంటాడా లేదంటే మిచెల్ సంట్నార్( Michelle Santner ) ను తీసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.ఇక వీళ్లిద్దరిలో ఎవరినో ఒకరిని మాత్రమే తీసుకోబోతున్నాడు అనేది మాత్రం తెలుస్తుంది.

కానీ ఎవరిని తీసుకుంటాడు అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇక ఇద్దరు స్పిన్ బౌలర్లు కావడం మరియు ఆల్ రౌండర్లు కావడంతో వీళ్ళలో ఎవరైతే టీమ్ కి బాగా ఆడగలుగుతారు అనేదాన్ని బట్టి టీమ్ లోకి వాళ్ళని తీసుకుంటాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

Advertisement

అయినప్పటికీ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే అవకాశం దక్కే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.కాబట్టి కొన్ని మ్యాచ్ లు ఒకరిని మరికొన్ని మ్యాచులు మరొకరిని తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పటి వరకు గత 5 సీజన్ల నుంచి సంట్నార్ చెన్నై టీం సైడే ఆడుతున్న ఆయనకి ఒక్కసారి కూడా ఫుల్ సీజన్ ఆడే అవకాశమైతే రాలేదు.

అయినప్పటికీ అతన్ని ధోని అతన్ని టీం లోనే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.మరి ఈసారైనా అతనికి ఒక సీజన్ మొత్తం ఆడే అవకాశాన్ని కల్పిస్తాడా? లేదంటే మళ్లీ బెంచ్ కే పరిమితం చేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు