Canadians On Migration : మా దేశంలో వలసదారులు పెరిగిపోతున్నారు.. మైగ్రేషన్‌పై కెనడియన్ల అసహనం , వెలుగులోకి సంచలన సర్వే

మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సంస్కరణలు తీసుకొస్తోంది కెనడా( Canada ) .మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, మంచి ఉద్యోగావకాశాలు వుండటంతో పలు దేశాల విద్యార్ధులు కెనడాకు క్యూ కడుతున్నారు.

 Half Of Canadians Feel That Too Many Immigrants Entering The Country Survey-TeluguStop.com

అలాగే సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా జారీ, త్వరగా శాశ్వత నివాస హోదా వంటి అనుకూల అంశాలు కెనడా వైపు విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.కోవిడ్ తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు తీసుకురావడంతో కెనడాకు వలసలు పెరుగుతున్నాయి.

అయితే ప్రస్తుతం గృహ సంక్షోభం, జీవన వ్యయాల పెరుగుదల కారణంగా కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్ధుల( International students ) రాకపై కొన్ని పరిమితులు విధిస్తోంది.

అయితే తమ దేశానికి పెరుగుతున్న వలసలపై మెజారిటీ కెనడియన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు ఓ సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది.‘‘మాంట్రియల్ హెడ్‌క్వార్టర్డ్ అసోసియేషన్ ఫర్ కెనడియన్ స్టడీస్ ’’, ‘‘ మెట్రోపాలిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏజెన్సీ లెగర్’’( Metropolis Institute of Agency Leger ) నిర్వహించిన సర్వేలో 50 శాతం మంది కెనడియన్లు తమ దేశంలో వలసదారులు చాలా ఎక్కువగా వున్నారని అభిప్రాయపడ్డారు.

ఔట్‌లెట్ నేషనల్ పోస్ట్ ఉదహరించిన ప్రకారం.కెనడియన్ ప్రభుత్వం జనవరి 2023లో నిర్వహించిన సర్వేలో ఇదే రకమైన అభిప్రాయాన్ని కలిగివున్న ప్రజల సంఖ్య 21 శాతం పెరిగింది.

Telugu Canadians, International, Naresh Chavda, Outlet National-Telugu NRI

చరిత్రను గమనిస్తే .కెనడియన్లు ఎన్నడూ వలస వ్యతిరేక విధానాలను , సెంటిమెంట్‌ను కలిగి లేరు.కొత్త వారి రాకను అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతించాయి.కానీ తాజా సర్వే కెనడియన్లలో వలసదారులపై పెరుగుతున్న అసహనాన్ని ప్రతిబింబిస్తోంది.కోవిడ్ 19 మహమ్మారి కారణంగా విధించిన ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత వలసల పెరుగుదలపై ప్రజానీకంలో తాజా అభిప్రాయాలు పెరిగాయి.2022లో దాదాపు ఒక మిలియన్ మంది కొత్తవారు కెనడాలో అడుగుపెట్టగా.2023లో ఇది మరింత పెరిగింది.అంతేకాదు.

గతేడాది మిలియన్ మంది అంతర్జాతీయ విద్యార్ధులను కెనడా చూసింది.

Telugu Canadians, International, Naresh Chavda, Outlet National-Telugu NRI

గ్లోబయాన్ ఇమ్మిగ్రేషన్ కార్పోరేషన్ ప్రెసిడెంట్ నరేష్ చావ్డా ( Naresh Chavda )మాట్లాడుతూ.తాము వలస వ్యతిరేకులమని కెనడియన్లు చెప్పడం లేదన్నారు.కానీ వలసదారుల సంఖ్య దేశ సామర్ధ్యాన్ని మించి వుండకూడదన్నదే ప్రజల అభిప్రాయమన్నారు.

జీవన వ్యయం, గృహ సంక్షోభం, తదితర అంశాలు వలసదారులపై అసంతృప్తి పెరగడానికి కారణమని నరేష్ అన్నారు.ఒకప్పుడు ఇమ్మిగ్రేషన్ పట్ల ఉదారవాద వైఖరిని అవలంభించిన కొన్ని సమూహాలు .ప్రస్తుతం వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని భయపడుతున్నారని చావ్డా చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube