హైదరాబాద్ లోని లక్డికాపూల్( Lakdikapool ) లో ఓ కారు అగ్నికి ఆహుతి అయింది.పెట్రోల్ బంకుకు సమీపంలో కారులో ఒక్కసారిగా మంటలు( Fire in Car ) చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకి ఆపి పరుగులు తీశాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే కారు వివరాలు ఇంకా తెలియరాలేదు.