సినిమా ఇండస్ట్రీకి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒక హీరో ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఆయనకు సపోర్టుగా వాళ్ళ అన్నయ్య కానీ, లేదా వాళ్ళ నాన్న కానీ ఆ ఫ్యామిలీ నుంచి అంతకుముందు స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్న ఎవరో ఒకరు వాళ్లకు సపోర్టుగా ఒక చిన్న పాత్రలో నటించి వాళ్లకు బూస్టప్ ఇస్తూ వాళ్ల సినిమా సూపర్ సక్సెస్ కావడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు.ఇక అందులో భాగంగానే సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) కొడుకు అయిన మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడు( Rajakumarudu ) సినిమాలో కృష్ణ మహేష్ నాన్న పాత్రలో నటించి మెప్పించాడు.
అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక దానితో పాటుగా బిగోపాల్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన వంశీ సినిమాలో( Vamsi Movie ) కూడా కృష్ణ ఒక పాత్రలో నటించాడు.
అయినప్పటికీ ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ అయితే అవ్వలేదు.
ఇక మోహన్ బాబు( Mohan Babu ) కూడా వాళ్ళ కొడుకులు నటించిన సినిమాల్లో నటించాడు.ముఖ్యంగా మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాలో( Sree Movie ) మోహన్ బాబు ఒక పాత్రలో నటించాడు అయినప్పటికీ తనకి సక్సెస్ మాత్రం ఇవ్వలేకపోయాడు.ఇక చిరంజీవి( Chiranjeevi ) కూడా రామ్ చరణ్ రెండో సినిమా అయిన మగధీరలో ( Magadheera ) బంగారు కోడి పెట్ట సాంగ్ లో ఒక చిన్న రోల్లో నటించి మెప్పించాడు.
ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది.దాంతో రామ్ చరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు.
అలాగే అఖిల్ ( Akhil ) హీరోగా వచ్చిన తన మొదటి సినిమా అయిన అఖిల్ లో నాగార్జున( Nagarjuna ) ఒక సాంగ్ లో వచ్చి డ్యాన్స్ చేసి వెళ్ళిపోతాడు.దాని ద్వారా తన కొడుకుకి బూస్టప్ ఇవ్వాలని అనుకున్నాడు.కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.ఇక అప్పటి నుంచి అఖిల్ కి సరైన సక్సెస్ లేదనే చెప్పాలి.