జగతి( Jagathi )మేడం పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు( Guppedantha Manasu ) సీరియల్ లో జగతి పాత్రలో నటించినటువంటి నటి జ్యోతి రాయ్( Jyothi Rai ) ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి తప్పుకొని వరుస సినిమాలతోనూ అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈమె కన్నడ నటి అయినప్పటికీ ఈ సీరియల్లో జగతి పాత్రలో ఎంతో హుందాగా కనిపించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.
అయితే ఈమెలో మరో యాంగిల్ కూడా ఉంది అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది.
ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు జగతి మేడం.ఇలా తన భర్తతో ఉన్నటువంటి రొమాంటిక్ ఫోటోలను( Romantic Photos ) వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తనకు ఇష్టమైన హీరో విషయం గురించి ప్రశ్న వేశారు.
మీకు ఇష్టమైనటువంటి హీరో ఎవరు అనే ప్రశ్న తనకు ఎదురు కావడంతో ఈమె సమాధానం చెబుతూ నాకు ఈ ఇండియాలోనే ఒకే ఒక హీరో అంటే ఇష్టమని అది మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంటే తనకు ఇష్టం అంటూ ఈ సందర్భంగా జ్యోతి తనకు ఇష్టమైనటువంటి హీరో గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈమె నిజానికి కన్నడ నటి అయినప్పటికీ టాలీవుడ్ హీరో అంటే తనకు ఉన్నటువంటి ఇష్టాన్ని బయట పెట్టడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.