Senior NTR Rajinikanth : ఎన్టీఆర్ రజనీకాంత్ కి చేసిన సహాయం ఏంటి ? నువ్వు దేవుడు సామి

రజనీకాంత్( Rajinikanth ) ఇప్పుడైతే యోగిగా మారిపోయారు.ఒకరకంగా చెప్పాలంటే సన్యాసి గా జీవితాన్ని వెల్లదిస్తున్నారు.

 Ntr Help To Rajinikanth Career-TeluguStop.com

దైవ చింతన తప్ప మరొక ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు.సినిమాలు అలాగే ఆధ్యాత్మికత మాత్రమే ఆయన జీవితంలో ప్రస్తుతం ఉన్నాయి.

సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఎంత ఎత్తుకు ఎదగాలో అంతా చూసేసారు.ఇక చూడడానికి ఏమీ లేదని కేవలం మిగిలి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా బ్రతకాలి అన్న ఒకే ఒక కారణంతో ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదంతా కూడా ఆయన ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి మొదలుపెట్టారు.కానీ కెరియర్ మొదట్లో కాస్త స్టార్ డం వచ్చిన తర్వాత ఆయన వ్యసనాలకు బానిస అయ్యారు అనే సంగతి మనందరికీ తెలిసిందే.

Telugu Ntrrajinikanth, Rajinikanth, Senior Ntr, Tiger-Movie

విపరీతమైన మద్యం తాగుతూ( Alcohol ) సిగరెట్లు కూడా అలవాట్లు ఉండేది.ఆ మత్తులో ఎప్పుడూ ఉండేవారు.తాగి ఒక్కోసారి షూటింగ్ కూడా సరిగా వచ్చేవారు కాదు.ఎక్కడపడితే అక్కడ తాగేస్తూ ఉండేవారట.అందుకే కొన్ని సినిమాలు ఆయన పద్ధతి తట్టుకోలేక మధ్యలో ఆపేసేవారు.కొంతమంది అయితే షూటింగ్ మొదలయ్యాక కూడా మరొక హీరోతో మళ్ళీ ఈ సినిమా మొత్తం రీ షూట్ చేసుకునే వారట.

అలాంటి పరిస్థితులలోనే ఎన్టీఆర్ తో పాటు టైగర్( Tiger Movie ) అనే ఒక సినిమాలో రజనీకాంత్ ని కూడా ఓకే చేసుకుని మళ్ళీ స్టారర్ మూవీ గా ప్రారంభించారు.అయితే ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్న అన్న భయం కానీ అలాంటి పెద్దవారిని ఇబ్బంది పెట్టొద్దు అని జ్ఞానం లేకపోయింది ఆ సమయంలో రజనీకాంత్ కి

Telugu Ntrrajinikanth, Rajinikanth, Senior Ntr, Tiger-Movie

యధావిధిగా తాగుతూ సరిగ్గా షూటింగ్ కి వచ్చేవారు కాదు, ఇక అతని పద్ధతి నచ్చక నిర్మాత, దర్శకుడు రజనీకాంత్ ని ఈ సినిమా నుంచి తీసేద్దామని కూడా ఎన్టీఆర్ కి సలహా ఇచ్చారట.కానీ ఆ మాటతో కోప్పడిన ఎన్టీఆర్( Senior NTR ) అతడికి తాగుడు అలవాటు ఉంటే ఎలాగోలా నచ్చ చెప్పి షూటింగ్ కి తీసుకురండి.కోపం ఉంటే అది ఎలా తగ్గించాలో అర్థం అయ్యేలా చెప్పండి.

అంతేకానీ సినిమాలో నుంచి తీసేస్తే అతను భవిష్యత్తు ఏమవుతుంది.రజనీకాంత్ ఏదో ఒక రోజు పెద్ద స్టార్ అవుతాడు అంటూ ఎన్టీఆర్ ఆ సినిమాలో రజనీకాంత్ ఉండేలా చూసుకున్నాడట.

ఈ విషయం తెలిసి రజనీకాంత్ చాలా సిగ్గుపడ్డారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube