ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Hero Prabhas 0 ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో అగ్ర హీరోగా వెలుగొందుతున్నాడు.ఇక ఆయన చేసిన మొదటి సినిమా ఈశ్వర్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత చేసిన ఒకటి, రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
అయినాకూడా వర్షం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక అప్పటి నుంచి వెను తిరిగి చూడకుండా వరుసగా సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా రీసెంట్ గా సలార్ సినిమా( Salaar Movie )తో కూడా భారీ హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమాతో మరోసారి 700 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి ఇండియాలో ప్రభాస్ లాంటి హీరో లేడు అనేది మరోసారి ప్రూవ్ చేశాడు.ఇక ఇదిలా ఉంటే ఈయన చేస్తున్న వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని కూడా పెంచుతూ వస్తున్నాయి.అయితే ఈయన నటించిన కొన్ని సినిమాలు మొదట ఫ్లాప్, యావరేజ్ టాక్( Flop Talk ) తెచ్చుకొని ఆ తర్వాత మంచి విజయాలను అందుకున్నాయి.అవి ఏం సినిమాలు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
బుజ్జిగాడు సినిమా( Bujjigadu )ని చూసుకుంటే ఈ సినిమా మొదట యావరేజ్ సినిమా గా నిలిచినప్పటికి ఆ తర్వాత ఒక సూపర్ హిట్ సినిమాగా మిగిలింది.అలాగే బిల్లా సినిమా( Billa Movie ) కూడా స్టైలిష్ గా ఉంది అనే టాక్ తెచ్చుకున్నప్పటికి కొంత మంది కి పెద్దగా నచ్చలేదు కానీ లాంగ్ టైం లో మాత్రం ఈ సినిమా బాగా ఆడింది. మిస్టర్ పర్ ఫెక్టు సినిమా( Mr Perfect ) కూడా ఒక వర్గం ప్రేక్షకులను అలరించడంలో కొంతవరకు డిసప్పాయింట్ చేసినప్పటికీ, ఆ తర్వాత ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను సాధించింది.
రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా కూడా మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం లాంగ్ రన్ సూపర్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది…
.