ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీసిద్ధం( Siddham meeting )భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ మేరకు సభకు కావాల్సిన ఏర్పాట్లను నేతలు ముమ్మరంగా చేస్తున్నారు.
కాగా మొత్తం పది ఎకరాల ప్రాంగణంలో సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.సాయంత్రం జరుగుతున్న వైసీపీ సభకు సీఎం జగన్ తో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు.
ఈ సిద్ధం సభకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మొత్తం యాభై నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది సభకు తరలివచ్చే విధంగా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.భీమిలి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం జగన్( CM Jagan ) వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
సభ నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించనున్నారు.మరోవైపు సిద్ధం సభ నేపథ్యంలో వైసీపీ( YCP ) శ్రేణులు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.గజదొంగల ముఠా నుంచి ప్రజలను కాపాడే ధీరుడు, కౌరవుల పద్మవ్యూహాంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.ఇక్కడ ఉన్నది అర్జునుడు అంటూ భారీ ఫ్లెక్సీలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు.