ఈ ఏడాది నవంబర్ నెలలో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి చెందిన డోనాల్డ్ ట్రంప్( Donald Trump ) మరోసారి పోటీ చేయబోతున్నారు.
గతంలో 45వ అమెరికా అధ్యక్షుడిగా 2016 నుండి 2020 వరకు రాణించారు.ఈ ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ ( Republican Party )తరఫున పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ గెలవడం జరిగింది.
అమెరికాలో తాజా పరిణామాలు బట్టి చూస్తే ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా దాదాపు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా డోనాల్డ్ ట్రంప్ కి యూకే కోర్టు( UK court ) ఊహించని షాక్ ఇవ్వడం జరిగింది.విషయంలోకి వెళ్తే ఓర్బీస్ సంస్థ( Orbis Company ) పై ట్రంప్ వేసిన పరువు నష్టం దావాను కోర్టు కొట్టేసింది.బ్రిటన్ మాజీ స్పై క్రిస్టోఫర్ స్టిలికి చెందిన ఈ సంస్థ నుంచి 2017 లో సంచలన రిపోర్టు లీక్ అయ్యింది.
ట్రంప్ రష్యాలో అసాంఘిక పార్టీలలో పాల్గొన్నారని… రష్యన్ అధికారులకు లంచం ఇచ్చారని పేర్కొంది.దీంతో ఓర్బీస్ సంస్థ పై ట్రంప్ పరువు నష్టం దావా వేయగా అది చాలా లేట్ అయిందని విచారణకు బలమైన కారణం లేనందున కేసును కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
దీంతో డోనాల్డ్ ట్రంప్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లయింది.