ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన అయిన వాళ్లలో కుమారి ఆంటీ( Kumari Aunty ) ఒకరు.ఊహించని వివాదాలలో చిక్కుకున్న కుమారి ఆంటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Telangana CM Revanth Reddy )సపోర్ట్ లభించడంతో ఆమె ఈ సమస్య నుంచి బయటపడ్డారు.
అయితే ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా ఆమె తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు కుమారి ఆంటీ వరుసగా యూట్యూబ్ ఛానెళ్లకు ( YouTube channels )ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆయన డ్రైవర్ వచ్చి కర్రీస్ తీసుకెళ్లారని ఆమె చెప్పుకొచ్చారు.అలీ డైరెక్ట్ గా వచ్చి కర్రీస్ తీసుకెళ్లాడని ఆమె పేర్కొన్నారు.మౌత్ పబ్లిసిటీతోనే కుమారి ఆంటీ లక్షల్లో ఆదాయాన్ని సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.కుమారి ఆంటీకి రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.

కుమారి ఆంటీకి సంబంధించి కొన్ని నెగిటివ్ వీడియోలు వైరల్ అవుతున్నా ఎక్కువమంది ఆమె గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు.14 సంవత్సరాల నుంచి ఆమె ఫుడ్ స్టాల్ నడుపుతుండగా ఇప్పుడు ఆమెకు ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కింది.ఆమె కొంతమేర రేట్లు పెంచినా బిజినెస్ మాత్రం తగ్గదని మరి కొందరు చెబుతున్నారు.కుమారి ఆంటీకి రోజుకు 10,000 రూపాయల రేంజ్ లో లాభం వస్తోంది.

కుమారి ఆంటీ పొలిటికల్ కామెంట్లకు వీలైనంత దూరంగా ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కుమారి ఆంటీ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.కుమారి ఆంటీ అనవసర వివాదాలకు తావివ్వడం మంచిది కాదని వివాదాల వల్ల ఆమె బిజినెస్ పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.







