తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా మంది హీరోలు ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే స్టార్ హీరోగా పేరుపొందిన రామ్ కూడా తనదైన మార్క్ చూపించాలని చూస్తున్నాడు.
ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి.
ఇక రీసెంట్ గా తను చేసిన స్కంద సినిమా కొంతవరకు నిరాశపర్చినప్పటికీ ఇప్పుడు చేయబోయే డబల్ ఇస్మార్ట్( Double iSmart ) సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అవుతుందని తన కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఉత్సాహన్ని చూపించినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే రామ్ తో సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఆయన ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి.ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలి కానీ అది అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది.
ఇక ఇప్పుడు మరొక కథని రామ్ కి వినిపించబోతున్నట్టు గా తెలుస్తుంది.అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఇది తెలిసిన రామ్( Ram Pothineni ) అభిమానులు ఖుషి అవుతున్నారనే చెప్పాలి.ఎందుకంటే వరుసగా పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లతో రామ్ సినిమా చేయడం ఆయన కెరియర్ కి చాలా వరకు ప్లస్ అవుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక రామ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలనే ఉద్దేశంతోనే వరుసగా స్టార్ డైరెక్టర్ లను రంగంలోకి దింపుతున్నాడంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
.