సంక్రాంతి సినిమాలలో( Sankranti Movies ) బడ్జెట్, కలెక్షన్స్ లెక్కల ప్రకారం బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు హనుమాన్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.హనుమాన్ మూవీ( Hanuman Movie ) ఇప్పటివరకు 150 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ కలెక్షన్లు గ్రాస్ కలెక్షన్లు కాగా త్వరలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా నిలిచే అవకాశం అయితే ఉంది.
అయితే ఓవర్సీస్ లో హనుమాన్ ఖాతాలో సరికొత్త రికార్డులు చేరుతున్నాయి.
ఓవర్సీస్ టాప్ 5 సినిమాల జాబితాలో హనుమాన్ చేరింది.ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటివరకు 3.7 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.4వ స్థానంలో 8 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో బాహుబలి 1( Baahubali 1 ) ఉండగా ఆ కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
హనుమాన్ మూవీ హక్కులు తీసుకున్న వాళ్లకు ఈ సినిమాతో ఊహించని స్థాయిలో లాభాలు సొంతమవుతున్నాయి.పేరుకే హనుమాన్ చిన్న సినిమా అని కలెక్షన్ల లెక్కల ప్రకారం మాత్రం ఈ సినిమా పెద్ద సినిమానే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తేజ సజ్జా( Teja Sajja ) ప్రశాంత్ వర్మలకు( Prasanth Varma ) రాబోయే రోజుల్లో హనుమాన్ సినిమాను మించిన విజయాలు సొంతం కావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సైతం హనుమాన్ మూవీ హవా కొనసాగుతోంది.ఈరోజు, రేపు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఎక్కువగానే ఉన్నాయి.సంక్రాంతి సెలవులను ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుందని చెప్పాలి.
ఇతర సంక్రాంతి సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు బుకింగ్స్ మెరుగ్గా ఉన్నాయి.ఓవర్సీస్ లో హనుమాన్ సినిమా సాధించిన రికార్డ్ కలెక్షన్ల ద్వారా రాజమౌళి,( Rajamouli ) ప్రశాంత్ నీల్( Prasanth Neel ) తర్వాత ప్రశాంత్ వర్మ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.