చలికాలం( winter ) వచ్చిందంటే చాలు.చాలామందిని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు( Health problems ) వేధిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా చలి ప్రభావం వలన మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.వాతావరణం లో ఉష్ణోగ్రత తగ్గడం, చలిగాలుల వలన జలుబు, దగ్గు, ఒంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం సర్వసాధారణం.
ఎందుకంటే వాతావరణంలో స్వల్ప మార్పు వచ్చిన కూడా వైరస్ల బారిన పడే అవకాశం ఉంటుంది.ఇక శ్వాస కోసం వ్యాధులు మాత్రమే కాకుండా శీతాకాలంలో మైగ్రేన్, సైనస్ సమస్యలు కూడా వస్తాయి.
ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు చాలామందికి మైగ్రేన్ ( Migraine )ఎటాక్ చేస్తుంది.చలికాలంలో సంబంధం లేకుండా ఎదుర్కొనే నిరంతర ఆరోగ్య సమస్య ఇది అని చెప్పవచ్చు.
సాధారణంగా ప్రతి వ్యక్తి తలనొప్పి అనేది కొన్నిసార్లు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య.దీని వెనుక ఒత్తిడి, అలసట, నిద్రలేమి లాంటి కారణాలు ఉంటాయి.
దీని నుండి ఉపశమనం పొందాలంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు.కానీ తరచు తలనొప్పి రావడం వలన మైగ్రేన్ సంకేతం అని చాలామందికి తెలిసి ఉండదు.ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయినప్పుడు సైనస్( Sinus ) లేదా చెవి నొప్పి, మైగ్రేన్ తలనొప్పి( Ear pain, migraine headache ) కారణమవుతుంది.అయితే చలికాలంలో మైగ్రేన్ సమస్య నుండి బయటపడే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పటికి తలను వెచ్చని టోపీ లేదా కండువాతో కప్పుకోవాలి.దీంతో చల్లటి గాలి మీకు నేరుగా తగలదు.
దీంతో జలుబును రాకుండా కాపాడుకోవచ్చు.అలాగే తలకు మసాజ్ చేయడానికి నూనెను ఉపయోగించాలి.
దీంతో మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
అలాగే డాక్టర్ సూచించిన మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోవాలి.ఇక వేడి నూనె నూనెతో( hot oil ) తలకు మసాజ్ చేయడం వలన నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.సమయానికి నిద్రించడం మంచిది.
దాదాపు 8 నుండి 9 గంటలు నిద్రించేలా చూసుకోవాలి.మైగ్రేన్ లక్షణాలు కనిపించినప్పుడల్లా ఒక గ్లాసు నీరు అందులో యాలకులు, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఐదు పుదీనా ఆకులను మరిగించి తాగితే ఉపశమనం లభిస్తుంది.
అంతేకాకుండా ఆవు నెయ్యి కరిగించి రెండు మూడు చుక్కలు ముక్కులో వేసుకుంటే కూడా మైగ్రేన్ సమస్య నుండి బయటపడవచ్చు.ఇక రాత్రంతా నీటిలో నానబెట్టిన కొన్ని ఎండు ద్రాక్షలు తిన్న కూడా మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.