టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ దర్శకులలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి.
ఇప్పటివరకు ఆయన కెరియర్ లో దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఒకదానిని నుంచి ఒకటి రికార్డులు సృష్టించాయి.ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే రాజమౌళితో సినిమా చేసిన హీరో తర్వాత చిత్రం తప్పకుండా పరాజయం అవుతుంది అన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటిదాకా ఆ సెంటిమెంట్ నుంచి ఏ హీరో తప్పించుకోలేకపోయాడు.
దీంతో దేవర తోనైనా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.అయితే కొందరు హీరోలకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాతే కాదు.చేయడానికి ముందు కూడా పరాజయాలు ఎదురవుతున్నాయి.
ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఎన్టీఆర్, రామ్ చరణ్( NTR, Ram Charan ) లతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందించాడు రాజమౌళి.
ఆ సినిమాకి ముందు అరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్ విజయాన్ని అందుకోగా వినయ విధేయ రామ తో చరణ్ కి మాత్రం భారీ షాక్ తగిలింది.బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఫిల్మ్ 2019 సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు మహేష్ బాబుకి( Mahesh Babu ) కూడా ఇంచుమించు అలాంటి షాకే తగిలింది.రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ తో చేయనున్న సంగతి తెలిసిందే.
ఆ భారీ ప్రాజెక్ట్ తో బిజీ కావడానికి ముందు మహేష్ నటించిన చిత్రం గుంటూరు కారం( Guntur karam ) త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమాకి మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వస్తోంది.దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ అదే కనుక జరిగితే రాజమౌళితో సినిమాకి ముందు పరాజయం అందుకున్న హీరోగా చరణ్ సరసన మహేష్ కూడా నిలుస్తాడు.
పైగా చరణ్, మహేష్ కి షాకిచ్చిన రెండూ కూడా సంక్రాంతి సినిమాలే కావడం విశేషం.కేవలం వీరు మాత్రమే కాకుండా గతంలో సింహాద్రి సినిమాకు ముందు నాగా సినిమాతో ఎన్టీఆర్ పరాజయం అందుకున్నాడు.
సై సినిమాకు ముందు శ్రీ ఆంజనేయం సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నారు నితిన్.చత్రపతి సినిమాకు ముందు చక్రం సినిమాతో ప్రభాస్ పరాజయం ఎదుర్కొన్నాడు.ఇలా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత సినిమాలు ఫ్లాప్ అవడం మాత్రమే కాకుండా ముందు చేసే సినిమాలు కూడా ఫ్లాప్ అవడం అన్నది సెంటిమెంట్ గా మారిపోయింది.