అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం గడుస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ( Republican Party ) నేతల మధ్య ఇది తారాస్థాయికి చేరింది.
ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ గురించి అవాస్తవమైన ఆరోపణలు చేశారు.ఆమె జన్మత: అమెరికా పౌరురాలు కానందున నిక్కీకి దేశాధ్యక్షురాలు అయ్యే అర్హత లేదని రైట్ రైట్ వెబ్‌సైట్ ది గేట్‌వే పండిట్ ప్రస్తావించిన స్క్రీన్ షాట్‌ను తన ట్రూత్ సోషల్ ప్రొఫైల్‌లో పంచుకున్నారు.
గేట్ వే పండిట్.( Gateway Pundit ) ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఏమన్నారంటే.‘‘ 1972లో నిక్కీ హేలీ( Nikki Haley ) పుట్టిన సమయంలో ఆమె తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాదని నివేదికలు సూచిస్తున్నాయి.రాజ్యాంగం 12వ సవరణ ప్రకారం అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష అభ్యర్ధిత్వం నుంచి హేలీని అనర్హురాలని ’’ పండిట్ పేర్కొన్నారు.
అయితే ఒక్క ట్రంప్ మాత్రమే కాదు.చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలను పంచుకున్నారు.
హేలీ తన 2012 నాటి ఆత్మకథలో తన తల్లిదండ్రులు భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో( Punjab ) జన్మించారని రాశారు.ఆ తర్వాత 2015లో ఆమె కార్యాలయం సౌత్ కరోలినాకు చెందిన వార్తాపత్రిక ‘‘ది స్టేట్’’తో మాట్లాడుతూ.నిక్కీ గవర్నర్‌గా వున్న సమయంలో ఆమె తండ్రి అజిత్ రాంధావా( Ajit Randhawa ) 1978లో యూఎస్ పౌరసత్వం పొందారని పేర్కొన్నారు.నిక్కీ హేలీ జన్మించిన ఆరేళ్ల తర్వాత ఇది జరిగింది.
అయితే రాజ్యాంగం ప్రకారం హేలీ ఖచ్చితంగా చట్టబద్ధ అభ్యర్ధి అని నిపుణులు అంటున్నారు.ఆమె తల్లిదండ్రుల పౌరసత్వ స్థితిపై వివాదం వున్నప్పటికీ నిక్కీ బాంబెర్గ్‌లో జన్మించడం వల్ల జన్మత: అమెరికా పౌరురాలేనని( US Citizen ) వారు వాదిస్తున్నారు.అమెరికా అధ్యక్ష బరిలో నిలవడానికి కావాల్సిన మూడు అర్హతల్లో ఇదీ ఒకటి.
కాగా.తొలుత సరైన ప్రచారం దక్కని హేలీ రోజులు గడిచే కొద్దీ దూసుకెళ్తున్నారు.రిపబ్లికన్ అభ్యర్ధుల్లో అందరికంటే ముందంజలో వున్న మాజీ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌కు హేలీ గట్టి పోటీ ఇస్తున్నారు.
హేలీకి 29 శాతం మంది మద్ధతు వుంటే.ట్రంప్‌కు 33 శాతం మంది అనుకూలంగా వున్నట్లు తేలింది.
అంటే ఇద్దరి మధ్యా కేవలం 4 శాతం మార్జిన్ మాత్రమే.హేలీ సెప్టెంబర్ నుంచి తన ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు.
మరో పోల్‌లో ఆమెకు ప్రస్తుతం లభిస్తున్న మద్ధతులో సగం వున్నట్లు తేలింది.సాంప్రదాయ ఓటర్లలో ట్రంప్‌కు బలమైన ప్రత్యర్ధిగా నిక్కీ హేలీ నిలబడుతున్నారు.