తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దేవిశ్రీప్రసాద్(Devisri Prasad) అలాగే ఎస్ఎస్ థమన్ (S.S Thaman) వంటి వాళ్ళు ఒకరు.ఇటీవల కాలంలో దేవిశ్రీప్రసాద్ ఒక సినిమా చేస్తే ఎస్ఎస్ తమన్ మాత్రం నాలుగైదు సినిమాలు చేస్తూ ఉన్నారు.ఇక దేవిశ్రీ సినిమా పాటలు ఎలాగ ఉంటాయి అంటే ఒకసారి వింటే చాలు కొన్ని సంవత్సరాలు పాటు ఆ పాటలను గుర్తు పెట్టుకునేలా ఉంటాయి.
కానీ తమన్ ఎలాంటి పాటలకు కంపోజ్ చేసిన ఎక్కడో ఒకచోట కాపీ చేశారంటూ ఈయనపై భారీ స్థాయిలో ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి.
తాజాగా తమన్ దేవి శ్రీ ప్రసాద్ పట్ల ఉన్నటువంటి కోపం కడుపు మంట మొత్తం బయట పెట్టేశారు.
స్టార్ మాలో శ్రీముఖి యాంకర్ గా సూపర్ సింగర్స్ (Super Singers) అనే సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే అయితే ఇటీవల ఈ కార్యక్రమానికి తమన్ ముఖ్య అతిథిగా వచ్చినట్టు తెలుస్తుంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఈ ప్రోమోలో భాగంగా తమన్ వర్సెస్ దేవిశ్రీ అంటూ వారి సినిమా పాటలను సింగర్లు పాడారు.
అయితే ఇక్కడ దేవిశ్రీప్రసాద్ పాటలు(Devisri Prasad Songs) పాడినప్పుడు ఆర్కెస్ట్రా వారు అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు.దీంతో తమన్ తనలో ఉన్నటువంటి అసూయ మొత్తం బయటపెట్టారు.నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆర్కెస్ట్రా వారు( Orchestra ) దేవిశ్రీప్రసాద్ పాటలకు బాగా వాయిస్తున్నారు అంటూ నవ్వుతూనే తన మనసులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ బయటపెట్టారు.అనంతరం మగువా మగువా అనే పాట రావడంతో తమన్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత నా పాటకు ఆర్కెస్ట్రా వాళ్ళు బాగా వాయించారు అంటూ తమన్ మాట్లాడారు
ఇక దేవి శ్రీ ప్రసాద్ వర్షం సినిమాలోని నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే పాటకు ఆర్కెస్ట్రా వాళ్ళు రెచ్చిపోయి మరి మ్యూజిక్ ఇచ్చారు దీంతో వారికి స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడమే కాకుండా నేను ఉన్నప్పుడు దేవి పాటలకు బాగా వాయిస్తారు అంటూ కామెంట్ చేయడంతో వెంటనే బాగా మండుతున్నట్టు ఉంది అనే డైలాగ్ రావడంతో తమన్ నిజమేనని ఒప్పుకున్నారు.మొత్తానికి ఈయన నవ్వుతూనే దేవిశ్రీప్రసాద్ పట్ల ఉన్నటువంటి కడుపు మంట మొత్తం బయట పెట్టారని నేటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.