ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు( Anganwadis ) దాదాపు 25 రోజులకు పైగా సమ్మె చేస్తూ ఉన్నారు.చలిని సైతం లెక్కచేయకుండా సమ్మె కొనసాగిస్తున్నారు.
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజు రోజుకి తీవ్రతరంగా మారుతుంది.గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్ నాయకులతో చర్చలు జరపగా విఫలమయ్యాయి.
గౌరవ వేతనం పెంచాలన్నే డిమాండ్ విషయంలో ప్రభుత్వంతో ఏకాభిప్రాయం కుదరటం లేదు.
పరిస్థితి ఇలా ఉంటే అంగన్వాడీల సమ్మెపై మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా… 11 డిమాండ్లలో 10 పరిష్కరించామని పేర్కొన్నారు.మిగిలిన ఒక్క డిమాండ్ మూడు నెలల తర్వాత పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు పరిస్థితి ఇలా ఉండగా ఐదేళ్లకు ఒక్కసారే జీతాలను పెంచుతాయని, 2, 3 ఏళ్లకు ఒకసారి పెంచడం సాధ్యం కాదని అన్నారు.ఎలాగో వచ్చే ఎన్నికలలో తామే అధికారంలోకి వస్తామని.
అంగన్వాడీల డిమాండ్ నెరవేరుస్తామని తెలియజేశారు.మరోపక్క అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది.
అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను జారీ చేసింది.ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీంతో అంగన్వాడీలో సమ్మె చట్ట విరుద్ధమని ఎస్మా ( ESMA )కింద శనివారం ప్రభుత్వం జారీ చేసిన జీవో పత్రులను దహనం చేశారు.