టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా రాఘవేంద్రరావుకు( Raghavendra Rao ) మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
రాఘవేంద్ర రావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి( Sridevi ) తర్వాత రోజుల్లో హీరోయిన్ గా నటించింది.
సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) కు హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకుంటామని చెప్పిన సమయంలో శ్రీదేవి వయస్సు 16 సంవత్సరాలు అయితే నా వయస్సు 14 సంవత్సరాలే కదా అని ఎన్టీఆర్ చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.జయప్రద కూడా ఎన్టీఆర్ కంటే చాలా చిన్న అని రాఘవేంద్రరావు కామెంట్లు చేశారు.
బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వలేకపోయానని ఏఎన్నార్ విషయంలో కూడా ఇలా జరిగిందని ఆయన తెలిపారు.

నాగార్జున గారితో భక్తి సినిమాలు చేయాలని అనుకున్న సమయంలో చాలామంది అభ్యంతరం చెప్పారని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.ఎక్స్ ప్రెషన్స్ పలికించడంలో నాగార్జున బాగా చేస్తారని కళ్లతో ఎక్స్ ప్రెషన్స్ పలికిస్తారని ఆయన వెల్లడించారు.అన్నమయ్య విషయంలో రిలీజ్ కు ముందు చాలా నెగిటివ్ కామెంట్లు వినిపించాయని రాఘవేంద్రరావు అన్నారు.

రాఘవేంద్రరావు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉన్నా పలు సినిమాల ప్రమోషన్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.రాఘవేంద్ర రావు వయస్సు 81 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ కోవెలమూడి( Prakash Kovelamudi ) పలు సినిమాలకు దర్శకత్వం వహించినా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయారు.రాఘవేంద్రరావును అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
రాఘవేంద్రరావు శిష్యులలో చాలామంది సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.రాఘవేంద్రరావు సినిమాలలో ఎన్నో సినిమాలు క్లాసిక్ హిట్లుగా నిలిచాయి.
ఆయన డైరెక్షన్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.