ఏపీ సీఎం జగన్ రేపు హైదరాబాద్ కు రానున్నారని తెలుస్తోంది.ఈ మేరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం జగన్ పరామర్శించనున్నారు.
గత నెల 8న కేసీఆర్ ప్రమాదవశాత్తు కాలుజారి పడటంతో ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కేసీఆర్ కు వైద్యులు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.
కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.ఈ క్రమంలోనే రేపు నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు.
అనంతరం ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.