పవన్ కళ్యాణ్ డేట్ కోసం పడిగాపులు కాస్తున్న మహేష్ బాబు..అసలు కారణం అదే!

‘సర్కారు వారి పాట’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) నుండి సినిమా వచ్చి దాదాపుగా ఏడాదిన్నర దాటింది.చాలా కాలం గ్యాప్ తర్వాత సెన్సషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఆయన చేసిన ‘గుంటూరు కారం’( Guntur Karam ) చిత్రం జనవరి 12 వ తారీఖున విడుదల కాబోతుంది.

 Will Pawan Kalyan Attend Mahesh Babu Guntur Karam Movie Pre Release Event Detail-TeluguStop.com

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ‘అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి ఐకానిక్ సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై మార్కెట్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

ఇక నేడు విడుదలైన ‘కుర్చీ మడత పెడితే’ అనే సాంగ్ ప్రోమో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఈ పాట మాస్ ఆడియన్స్ లో ‘గుంటూరు కారం’ చిత్రం పై మరింత క్రేజ్ పెంచింది.

Telugu Guntur Karam, Lb Stadium, Mahesh Babu, Pawan Kalyan, Pawankalyan-Movie

ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.పవన్ డేట్ కోసం వీళ్లిద్దరు ఎదురు చూడడం ఏమిటి?, పవన్ కళ్యాణ్ కి గుంటూరు కారం కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా?.ఆ పాయింట్ కే వస్తున్నాం.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని( Pre Release Event ) జనవరి 7వ తేదీ, లేదా 8వ తేదీన గ్రాండ్ గా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో చేద్దాం అని అనుకుంటున్నారు.

ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుంది అని మహేష్ ఆలోచన అట.ఈ విషయాన్నీ త్రివిక్రమ్ కి( Trivikram ) చెప్తే, ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం.అయితే జనవరి 7,8 తేదీలలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

Telugu Guntur Karam, Lb Stadium, Mahesh Babu, Pawan Kalyan, Pawankalyan-Movie

ఎందుకంటే త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతో క్షణం తీరిక లేకుండా చర్చలు జరుపుతూ ఫుల్ బిజీ గా ఉన్నాడు.ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ డేట్ ఆ సమయానికి ఖాళీగా ఉంటుందా లేదా అని కనుక్కునే ప్రయత్నం లో ఉన్నాడట త్రివిక్రమ్.ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి వస్తే మహేష్ పవన్ మ్యూచువల్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.

ఎందుకంటే కేవలం ఒకటి రెండు సందర్భాల్లో తప్ప పవన్ మరియు మహేష్ కలవడం చాలా తక్కువ సార్లు జరిగింది.ఇద్దరు కలిసి ఒక ఫొట ఫ్రేమ్ లో కనిపించి కూడా ఏళ్ళు గడిచాయి.

అలాంటిది ఇద్దరినీ ఒకే స్టేజి మీద చూస్తే అభిమానుల పరిస్థితి ఆరోజు ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube