ప్రస్తుతం అందరి కళ్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే పడ్డాయి.ఎందుకంటే తెలంగాణ ( Telangana ) లో ఎన్నికలు అయిపోయాక ఆంధ్ర ఎన్నికల్లో ఎవరి పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఇప్పటికే పలు సంస్థలు సర్వేలు చేసి రిజల్ట్ చెబుతున్నాయి.
ఇక అధికారంలో ఉన్న వైసీపీ ( YCP ) పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేస్తోంది.అలాగే టిడిపి జనసేన కూటమి కూడా అధికారంలో రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఏం జరుగుతుంది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.ఎందుకంటే.
టిడిపి టికెట్ ఆశించేవారు డబ్బు కొట్టు టికెట్ పట్టు అనే ఫార్ములాని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే టిడిపి ( TDP ) మరోసారి పరాజయం పాలవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారట టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.
అందుకే తన డబ్బు ఖర్చు చేయడం కంటే ఎవరికైతే టికెట్ కావాలో వారితోనే డబ్బులు ఖర్చు చేయిస్తే బాగుంటుందనే ఫార్ములాని ఫాలో అయ్యి సగటున ఒక నియోజకవర్గంలో టికెట్ కావాలంటే 35 కోట్లు డిపాజిట్ చేస్తేనే టికెట్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారట.అంతేకాదు ఎల్లో మీడియా ఎక్కువగా ఈసారి అధికారంలోకి వచ్చేది టిడిపి పార్టీనే అని గొప్పలు చెప్పుకోవడంతో అధికార పార్టీలో తాము కూడా ఎమ్మెల్యేలుగా ఉండాలి అనే భావనతో చాలామంది టికెట్ ఆశిస్తున్నారట.
అయితే ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వారిని 35 కోట్ల డిపాజిట్ చేయమని ముందుగానే కోరుతున్నారట.అయితే ఎప్పటినుండో పార్టీని పట్టుకుని వేలాడుతున్న సీనియర్ల విషయంలో కూడా ఇలాంటి పద్ధతే ఫాలో అవ్వడంతో చాలామంది చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ,లోకేష్ మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దేవినేని ఉమా ( Devineni Uma ) ని కూడా 35 కోట్ల డిపాజిట్ చేస్తేనే టికెట్ ఇస్తామని లోకేష్ చెప్పడంతో ఆయన చంద్రబాబు నాయుడుని కలిశారట.అయితే చంద్రబాబు నాయుడు కూడా కొడుకులాగే చెప్పడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో దేవినేని ఉమా పడిపోయారట.
అంతేకాకుండా తూర్పు నియోజకవర్గం నుండి రెండుసార్లు గెలిచిన గద్దె రామ్మోహన్ రావు ( Gadde Rammohan rao ) ని కూడా 35 కోట్లు డిపాజిట్ చేయాలని తెలిపారని రామ్మోహన్రావు అనుచరులే స్వయంగా చెప్పుకొస్తున్నారు.అయితే ఆయన అన్ని కోట్లు ఇవ్వకపోవడంతో వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తామని భయపట్టిస్తున్నారట.అయితే పార్టీని వీడే ఆలోచనలో రామ్మోహన్ రావు ఉన్నప్పటికీ ఏదో ఒక మూలన ఆయనకు వేరే పదవి కట్టబెడతారనే ఆశ ఉండడంతో టిడిపిలోనే ఉంటున్నారని తెలుస్తోంది.వీళ్లే కాకుండా ఇంకా చాలామంది సీనియర్ నాయకులకు కూడా టికెట్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు.
అంతేకాకుండా ఈసారి డబ్బున్న వాళ్ళకి ఎన్నారైలకే టికెట్లు కట్టబెట్టడానికి టిడిపి (TDP) నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.దాంతో ముందు నుండి పార్టీలో కొనసాగుతున్న సీనియర్లు అంతా టిడిపి అధినేత పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.