ఈ నెల 16 వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 26 వరకూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 'విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’

రాజన్న సిరిసిల్ల జిల్లా :కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించడం, పథకాలు అర్హులకు అందేలా తెలియజేయడానికి రూపొందించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర జిల్లా లో శనివారం ప్రారంభమైంది.ఈ నెల 16 వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 26 వరకూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర( Viksit Bharat Sankalp Yatra )’ జరగనుంది.

 Rajanna Sirisilla District ,viksit Bharat Sankalp Yatra ,narendra Modi-TeluguStop.com

ఈ యాత్ర సజావుగా జరిగేందుకుకేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అజయ్ గుప్తా, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) ఇప్పటికే సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న.
.

వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి చేకూరడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన కారణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరించడం, ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకోలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ….అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మొదటి రోజు వేములవాడ, సిరిసిల్ల, ఎల్లారెడ్డి పేట లలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర జరిగింది.ప్రజల నుంచి మంచి స్పందన లభించిందిఅధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.

పథకాలప్రత్యేకంగా రూపొందించిన విడియో లు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Narendra Modi ) సందేశాన్ని ప్రచార వాహనం డిజిటల్ స్క్రీన్ పై ప్రదర్శించారు.వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube