విద్యుత్ తలసరి వినియోగం విషయంలో కేసీఆర్ చెప్పిన లెక్కలు తప్పు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మరోపక్క.

గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతున్నారు.ఈ క్రమంలో విద్యుత్ తలసరి వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు.

విద్యుత్ తలసరి వినియోగంలో నెంబర్ వన్ తెలంగాణ అని కేసీఆర్.గతంలో ప్రచారం చేసింది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు.

విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంది.

కోటి ఎకరాలకు కాలువల ద్వారా నీరు ఇస్తే… రాష్ట్రంలో పంపుసెట్లు సంఖ్య ఎందుకు పెరిగింది అని ప్రశ్నించారు.2014లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల పంపుసెట్లు ఉంటే.ఇవ్వాళ ఆ సంఖ్య 29 లక్షలకు చేరుకుంది.

తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జల్లాలు… వినియోగించుకోలేకపోయాం అని స్పష్టం చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో ఉద్యమాల నుండి వచ్చిన పార్టీ అని చెప్పుకోవడం తప్ప అమరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వైనా పెట్టారా అని అసెంబ్లీ సమావేశాలలో నిలదీశారు.

కేవలం తన బంధువులకి కుటుంబ సభ్యులకు మాత్రమే కేసీఆర్ పదవులు ఇచ్చారని ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకునే కుటుంబాన్ని ఆదుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube