తెలంగాణలో త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో హంగ్( Hung ) వచ్చే అవకాశం ఉందా ? హంగ్ వస్తే ఏ పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది ? ఎవరు అధికారంలోకి వస్తారు ? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తెగ వినిపిస్తున్నాయి.119 స్థానాలు ఉన్న తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.2014, 2018 ఎన్నికల్లో బిఆర్ఎస్( BRS ) స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి అధికారాన్ని సొంతం చేసుకుంది.కానీ ఈసారి బిఆర్ఎస్ కు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో హంగ్ ఏర్పడడం ఖాయమా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై కూడా విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి అధికార బిఆర్ఎస్ 40 నుంచి 50 సీట్లు సాధించిన అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కొందరి అభిప్రాయం.ఎందుకంటే బిఆర్ఎస్ కు మజ్లిస్ పార్టీ( MIM ) మద్దతు ఉండడంతో ఆ పార్టీ 7 నుంచి 10 స్థానాల్లో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థులు సైతం బిఆర్ఎస్ వైపే ముగ్గు చూపే ఛాన్స్ ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.
అలాగే కాంగ్రెస్ లో( Congress ) కూడా బిఆర్ఎస్ కోవర్ట్ లు ఉన్నారని స్వయంగా హస్తం పార్టీ నేతలే చెబుతున్నారు.అలాచూస్తే కాంగ్రెస్ నుంచి కూడా 1-5 గెలిచిన ఎమ్మేల్యేలు బిఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టాక్.మొత్తం మీద హంగ్ వస్తే బిఆర్ఎస్ కే ఎక్కువ లాభం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ఈసారి బిఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దించుతామని చెబుతున్న కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంతా తేలికైన విషయం కాదు.
ఆ పార్టీకి వామపక్షాల మద్దతు( Left Parties ) ఉన్నప్పటికి 40-50 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.ఒకవేళ 50-60 సీట్లు సాధించిన అధికారంలోకి రావడం కష్టమే అనేది చాలమంది భావన.ఆ లెక్కన చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కనీసం 60 నుంచి 70 సీట్లు సాధించాలని చెబుతున్నారు విశ్లేషకులు.
మరి ఏ రకంగా చూసిన బిఆర్ఎస్ కే అనుకూల పవనాలు విస్తున్నాయనేది రాజకీయ వాదుల అభిప్రాయం.