తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Elections ) కచ్చితంగా తామే గెలుస్తామని బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఎంత పోటీ ఇచ్చినా విజయం తమదే అన్న ధీమాలో ఆ పార్టీ ఉంది.ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకునే విషయం పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది.
బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని , తమకే ప్రజలు పట్టం కడతారని , బిజెపి ఆశలు పెట్టుకుంది .దాని నిజం చేసుకునేందుకు అనేక వ్యూహాలను రచిస్తోంది.ఈ మేరకు పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ పై బిజెపి ప్రత్యేక దృష్టి పెట్టింది.పార్టీ అభ్యర్థుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వ్యూహాలు రచిస్తోంది.బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ పర్యవేక్షణ కు ప్రముఖుల ద్వారా ఓటర్లంతా కచ్చితంగా ఓటు వేసేలా చూడాలని సూచిస్తున్నారు.ఇక బూత్ కమిటీల వారిగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే విషయం పైన దృష్టి సారించారు.
పార్టీ వైపు మొగ్గు చూపే ఓటర్లను కచ్చితంగా చేయడంతో పాటు, ప్రత్యర్థులకు అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు , జిల్లా అధ్యక్షులు ముఖ్య నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి మరి ఫోన్ మేనేజ్మెంట్ పై సూచనలు చేశారు.ఈరోజు కూడా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పోల్ మేనేజ్మెంట్ పై కేలక సూచనలు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 3565 పోలింగ్ బూత్ లకు 90% బూతులలో బీజేపీ సంస్థగతంగా కమిటీలను ఏర్పాటు చేసింది.
ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజెపి అగ్ర నేతలు ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ), కేంద్ర హోం మంత్రి , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( J.P.Nadda ) తో పాటు, అనేకమంది కీలక నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో బిజెపికి ఓటింగ్ శాతం పెరుగుతుందని, కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రాబోతుందనే విషయం ప్రజలకు అర్థమైందని, ఆ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పైన పడుతుందని అదే తమకు గెలుపు బాటలు వేస్తుందని బీజేపీ నమ్మకంతో ఉంది.