తిరువనంతపురం వేదికగా జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( Ind vs Aus ) రెండో టీ20 మ్యాచ్లో యశస్వి జైస్వాల్( Yashasvi Jaiswal ) 25 బంతుల్లో 9 ఫోర్లు రెండు సిక్సర్లతో 53 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి అర్థ సెంచరీ చేశాడు.ఫీల్డింగ్ లో రెండు అద్భుతమైన క్యాచ్లు పట్టి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో భారత జట్టు 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
ఈ అవార్డు అందుకున్న సందర్భంలో యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.తొలి టీ20 మ్యాచ్ లో తన తప్పిదం వల్లనే రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) రన్ అవుట్ అయ్యాడని, ఆ తర్వాత రుతురాజ్ క్షమాపణలు కోరానని తెలిపాడు.
రుతురాజ్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తిని, తనను అర్థం చేసుకున్నాడని తెలిపాడు.
సూర్య కుమార్ యాదవ్ తో( Surya Kumar Yadav ) పాటు కోచ్ లక్ష్మణ్ మైదానంలో స్వేచ్ఛగా ఆడమని తనకు సలహా ఇచ్చారని, ఎట్టి పరిస్థితులలో ఒత్తిడికి గురి కావద్దని చెప్పడంతో తాను మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆఫ్ సెంచరీ చేశానని, ఇదేవిధంగా ఆడుతూ తన ఆటను మరింత మెరుగు పరుచుకుంటానని తెలిపాడు.
తాను అన్ని రకాల షాట్లను సమర్ధవంతంగా ఆడడం కోసం మానసికంగా మరింత బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని, తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి అవార్డులు మరెన్నో సాధించే విధంగా తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటానని తెలిపాడు. పవర్ ప్లే లో అర్థ సెంచరీ నమోదు చేసిన మూడవ భారత బ్యాటరుగా నిలిచాడు.ఈ జాబితాలో రోహిత్ శర్మ (50), కేఎల్ రాహుల్(50) మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నారు.