రూ.10వేల బడ్జెట్ లో బెస్ట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు ఇవే..!

ప్రస్తుత మార్కెట్లో HD ఫీచర్ ను సపోర్ట్ చేసే నాణ్యమైన పోర్టబుల్ ప్రొజెక్టర్లు( Portable Projectors ) చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.ఇవి పోర్టబుల్ కాబట్టి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకెళ్లొచ్చు.

 Best Portable Projectors Under 10k Budget Details, Best Portable Projectors, Und-TeluguStop.com

స్మార్ట్ టీవీల కంటే ప్రొజెక్టర్లు చాలా రకాలుగా మెరుగ్గా ఉంటాయి.మార్కెట్లో రూ.పదివేల బడ్జెట్లో దొరికే బెస్ట్ పోర్టబుల్ ప్రాజెక్టులు ఏమిటో చూద్దాం.

గ్రో వ్యూ 818c ప్రొజెక్టర్:

ఇది ఒక ఎల్ఈడి ప్రొజెక్టర్( LED Projector ) 1500Im కి మద్దతు ఇస్తూ అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ ఫీచర్ ను ( Chrome Cast ) కలిగి ఉంది.ఈ ప్రొజెక్టర్ ద్వారా స్మార్ట్ ఫోన్లో ఉండే సమాచారాన్ని నేరుగా ప్రోజెక్ట్ చేసుకోవచ్చు.ఇది మొత్తం వైర్లెస్ సిస్టం.దీని ధర రూ.8000 గా ఉంది.దీనిపై రెండు సంవత్సరాల పాటు వారంటీ ఉంది.

Wzatco pixel HD:

ఇది ఒక పోర్టబుల్ ఎల్సిడి ప్రొజెక్టర్.2000Im కి మద్దతు ఇస్తుంది.దీనిపై ఒక సంవత్సరం పాటు వారంటీ ఉంటుంది.అమెజాన్ లో( Amazon ) దీని ధర రూ.6490 గా ఉంది.

సియోమి Xming Q3 నియో ఫుల్ HD:

డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల అవ్వనుంది.ఇది ఒక ఎల్సిడి ప్రొజెక్టర్( LCD Projector ) మోడల్.1000:1 కాంట్రాస్ట్ రేషియో తో 230Im మాక్స్ తో వస్తుంది.దీని ధర రూ.9999 గా ఉంది.

Wzatco yuva Plus ఫుల్ HD:

ఇది ఒక ఎల్సిడి ప్రొజెక్టర్.4500:1 కాంట్రాస్ట్ రేషియో తో 6600Im తో వస్తుంది.దీనిపై ఒక సంవత్సరం పాటు వారంటీ ఉంటుంది.అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.దీని ధర రూ.9490 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube