సినీనటి రష్మిక మందన్న(Rashmika Mandanna) కు సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీని కొందరు తప్పుదోవ పట్టిస్తూ ఇలా కొందరి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలిగిస్తున్నారు.
ఈ క్రమంలోనే రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ఎంతో మంది సెలబ్రిటీలో ఆమెకు మద్దతుగా నిలబడి సపోర్ట్ చేశారు.అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.
తాజాగా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో గురించి ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్(Sara Tendulkar) స్పందించారు.అయితే తాను కూడా ఇలాంటి డీప్ ఫేక్ (Deep Fake) బాధితురాలిని అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.సారా టెండూల్కర్ కు ఇప్పటివరకు ట్విట్టర్లో ఖాతా లేదు కానీ ఈమె పేరు మీదట నకిలీ ఖాతాలు ఉన్నాయని వాటిని ఎవరు కూడా నమ్మొద్దు అంటూ తెలియజేశారు అదేవిధంగా డీప్ ఫేక్ వీడియో గురించి కూడా స్పందించారు.
మన సంతోషాలు బాధలు మన రోజువారి పనులను అందరితో పంచుకోవడానికి సోషల్ మీడియా ఒక అద్భుతమైన ప్లాట్ ఫామ్ అని సారా తెలియచేశారు.కానీ కొంతమంది మాత్రం ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని ఇలాంటి చర్యల వల్ల చాలా విసుగు వస్తుందని ఈమె తెలియజేశారు.ఇలా సోషల్ మీడియాలో నాకు సంబంధించిన కొన్ని డీప్ ఫేక్ ఫోటోలను తాను చూశానని ఈమె తెలిపారు.
ఆ ఫోటోలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని అలాగే ట్విట్టర్లో కూడా నా పేరు మీదట చాలామంది నకిలీ ఖాతాలను( Fake Accounts ) క్రియేట్ చేశారని నాకు ఎలాంటి ట్విట్టర్ ఖాతా లేదని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈమె తెలియజేశారు.