కేజీఎఫ్2 మూవీకి సలార్ ట్రైలర్ రిలీజ్ టైమ్ కు ఉన్న లింక్ ఇదే.. మామూలు ప్లాన్ కాదంటూ?

సలార్ మూవీ ( Salaar movie )విషయంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి వస్తున్న రూమర్లు నిజమవుతున్నాయి. కేజీఎఫ్2 మూవీకి సలార్ ట్రైలర్ రిలీజ్ టైమ్ కు ఉన్న లింక్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

 This Is The Connection Between Kgf2 And Salaar Trailer Release Date Detailsher-TeluguStop.com

అయితే కేజీఎఫ్2 సినిమా క్లైమాక్స్ లో ఒక గడియారం సమయం 7 గంటల 19 నిమిషాలు చూపిస్తుంది.సరిగ్గా అదే టైమ్ కు సలార్ ట్రైలర్ రిలీజ్ కానుండటం హాట్ టాపిక్ అవుతోంది.

కేజీఎఫ్2 మూవీకి( kgf2 ) సలార్ ట్రైలర్ రిలీజ్ టైమ్ కు ఉన్న లింక్ వల్ల ప్రశాంత్ నీల్( Prashanth Neel ) యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.రాఖీ భాయ్ కు, సలార్ కు మధ్య లింక్ ను ప్రశాంత్ నీల్ ఏ విధంగా ప్లాన్ చేశారో చూడాల్సి ఉంది.ప్రభాస్ కు సంబంధించిన తాజా పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.స్లిమ్ లుక్ లో కిర్రాక్ ఫోజుతో ప్రభాస్ ప్రేక్షకులను మాయ చేశారు.

ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలు ప్లాన్ కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సలార్ మూవీలో ఐటమ్ సాంగ్ ఉంటుందని అయితే ఆ సాంగ్ లో ప్రభాస్( Prabhas ) కనిపించరని సమాచారం అందుతోంది.భీభత్సమైన యాక్షన్ కథాంశంతో సలార్ తెరకెక్కగా కొన్ని నెలల గ్యాప్ లోనే పార్ట్1, పార్ట్2 థియేటర్లలో విడుదల కానున్నాయి.సలార్ సినిమాలో హై రేంజ్ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ మరింత భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి.ప్రభాస్ సైతం తన సినిమాలు ఫ్యాన్స్ కు నచ్చేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉండనున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.ప్రభాస్ త్వరలో సలార్ ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube