క్యాన్సర్ తో బాధపడుతున్నడు ఏం తినాలి?

క్యాన్సర్ రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి.అందులో అతిముఖ్యమైన కారణంగా జీవనవిధానాన్ని చెప్పుకోవచ్చు.

 These Are Food Habits To Be Employed While Fighting With Cancer-TeluguStop.com

క్యాన్సర్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కారణమయినట్లే, క్యాన్సర్‌ బలపడడానికి కూడా మన ఆహారపు అలవాట్లు కారణమవుతాయి.కాబట్టి క్యాన్సర్‌ తో పోరాడుతున్నప్పుడు మన శరీరానికి సహాయం చేసే విధంగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.

* హైడ్రోజెనెటెడ్ ఆయిల్స్, సింథెటిక్ ఫుడ్ కలర్స్, సోడియం నైట్రేట్, మిగితా కెమికల్స్‌ ఉన్న ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

* రిఫైన్డ్ ఆహారం ఏదైనా సరే .దానికి దూరంగా ఉండడమే మంచిది.బియ్యం, వైట్ బ్రెడ్, బేక్డ్ ఫుడ్స్, కుకీస్ .ఇలాంటివి పక్కనపెట్టి న్యూట్రింట్స్ ఎక్కువగా లభించే ఆహారంపై దృష్టిపెట్టాలి.

* క్యాన్సర్ తో పోరాడే శక్తి ఉన్న ఆహారాన్ని మాత్రమే డైట్ లోకి చేర్చుకోవాలి.

విటమిన్‌లు, న్యూట్రింట్స్, మినరల్స్ దొరికే అహారం మాత్రమే క్యాన్సర్‌ తో పోరాడుతున్నప్పుడు సురక్షితం.

* ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే క్యాన్సర్ తో పోరాడుతున్న కాలంలో మీ నేస్తాలు.

ఎటువంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ లేకుండా పండించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

* క్యాబేజి, బ్రకోలి, టమాటో, బెర్రీస్, గ్రీన్ టీ, ద్రాక్ష తోలు, బీన్స్, స్పీనచ్ … ఇవి మీ డైట్ లో ఉండాల్సిన పదార్థాలు.

ఇవి మాత్రమే కాదు, యాంటిఆక్సిడెంట్స్ కలిగి ఉండే ఏ ఆహారమైనా, డాక్టర్ సూచన ప్రకారం తినొచ్చు.

* ఆకుకూరలు, ఫైబర్, విటమిన్‌లు, న్యూట్రింట్స్ బాగా దొరికే ఆహారం తీసుకోవడంతో పాటు రోజుకి 7-8 గ్లాసుల పరిశుభ్రమైన నీరు తాగడం కూడా అవసరం.

ఎందుకంటే క్యాన్సర్‌ చికిత్స జరుగుతున్నప్పుడు శరీరం హైడ్రేట్ గా ఉండటంతో పాటు టాక్సిస్స్ ఫ్రీగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube