మీ ఇల్లు ఒక బిజీ రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉందా? లేదంటే ఓ పెద్ద రేల్వే స్టేషన్ దగ్గర ఉందా? పెద్ద బస్టాండ్ దగ్గర ఉందా? ఇలా ఉంటే ప్రయాణ సౌకర్యాలకి బాగుంటుంది.కాని మన ప్రాణం కూడా త్వరగానే పైకి ప్రయాణం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు.
లండన్ పరిశోధకులు జర్మనిలో హెల్త్ ఇన్సూరెన్సు తీసుకున్న మిలియన్ ప్రజల ఆరోగ్యాన్ని, వారు నివసిస్తున్న ప్రాంతాలని బాగా పరిశీలించి, ట్రాఫిక్ చప్పుడుకి దగ్గరగా బ్రతుకుతున్నవారికి హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య పెరుగుతుందని సెలవిచ్చారు.
ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఇలాంటి ప్రదేశాల్లో శబ్ద కాలుష్యం తరుచుగా 65 డెసిబుల్స్ ని దాటుతూ ఉండటం వలన.హార్ట్ ఎటాక్ వలన 2014/2015 సంవత్సరాల్లో చనిపోయినవారిలో ఎక్కువశాతం మంది శబ్దకాలుష్యం వలన ఇబ్బందిపడ్డవారే అని రిసెర్చ్ లో తేలింది.
“అవును, శబ్దకాలుష్యం హార్ట్ ఎటాక్ కి కారణమవుతుంది.ఇది కొత్త విషయం కాదు.శబ్ద కాలుష్యానికి సాధ్యమైనంత దూరంలో మనిషి బ్రతకాలి.లేదంటే చాలా కష్టం.ట్రాఫిక్ కి దూరంగా వెళ్లిపోవాలి మనిషి.పోటిప్రపంచంలో ప్రయాణాల్ని ఆపుకోలేం కాని, మనం ఇల్లు ఎలాంటి ప్రదేశంలో కట్టుకోవాలి అనేది మాత్రం నిర్ణయించుకునే వీలు ఉంది.” అంటూ ఓ పరిశోధకుడు వాఖ్యానించాడు.