పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) హీరోయిన్ గా వస్తున్న మంగళవారం సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ తెగ మాట్లాడుకుంటున్నారు.దానికి ప్రధాన కారణం మంగళవారం సినిమా ట్రైలర్ చూడగానే చాలామందికి ఈ సినిమాపై మంచి హైప్ పెరిగింది.
దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న రీతిలో ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఆర్ ఎక్స్ 100, మహాసముద్రం వంటి సినిమాలు తెరకెక్కించిన అజయ్ భూపతి(Ajay Bhupati).
ఇక తన మొదటి సినిమా కే మంచి హిట్ అందించడంతో పాయల్ రాజ్పుత్ తనకి కిడ్నీ సమస్య ఉన్నా కూడా ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట.
అయితే ఈ సినిమాకి డైరెక్టర్ అజయ్ భూపతి అలాగే నిర్మాత స్వాతి రెడ్డి గుణపాటి(Swathi Reddy Gunapati), సురేష్ వర్మలు.
ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమా నిర్మాత స్వాతి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ( Sreeja ) స్నేహితురాలని, ఈ కారణంతోనే చిరంజీవి తన కూతురు ఫ్రెండ్ అయినా స్వాతి రెడ్డి నిర్మాతగా చేస్తున్న మంగళవారం సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియా వేదిక ద్వారా రిలీజ్ చేశారు దీంతో ఈ సినిమాకి మరింత హైప్ పెరిగింది.
అయితే శ్రీజ ఫ్రెండ్ అయిన స్వాతి రెడ్డి గుణపాటి ఎవరో కాదు ఆమె ప్రముఖ వ్యాపారవేత్త అయిన నిమ్మగడ్డ ప్రసాద్ (Nimmagadda Prasad) కూతురట.అయితే నిమ్మగడ్డ స్వాతి రెడ్డి అంటే చాలామందికి తెలుసు.కానీ ఈమె తన అత్తింటి వారి పేరైనా గుణపాటి అనే పేరుని తన పేరు చివర్లో పెట్టుకోవడం వల్ల ఈ స్వాతి రెడ్డి ఎవరు అని కొంతమంది ఆరా తీసారు.
అయితే మ్యాట్రిక్స్ ఫార్మా సంస్థ యజమాని అయిన నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి రెడ్డి అని చాలా తక్కువ మందికి తెలుసు.
ఇక ఈమె 2016లో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గుణపాటి శివకుమార్ కొడుకు ప్రణవ్ ను( Gunapati Pranav ) పెళ్లి చేసుకోవడం వల్ల అప్పటినుండి స్వాతి రెడ్డి గుణపాటి గా మారిపోయింది.ఇక స్వాతి రెడ్డి మన అందరికీ సుపరిచితురాలైన నిమ్మగడ్డ ప్రసాద్ తనయురాలు అని ఈ సినిమాతో అందరికీ తెలిసి వచ్చింది.ఇక మంగళవారం సినిమా (Mangalavaram movie) నవంబర్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.