ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి.ప్రస్తుతం ఎన్నికల హడావుడి జరుగుతోంది.
మరికొద్ది రోజుల్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది .అప్పుడు గాని ఏ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అనేది తెలియదు.ప్రస్తుతం కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా సర్వే రిపోర్ట్ లు రావడం తో తెలంగాణ కాంగ్రెస్ లో జోరు పెరిగింది.ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి.
ఇక పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి సారించి , తమతో పాటు తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అది పక్కనపెట్టి కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతామంటూ ప్రకటనలు చేస్తుండడం వంటివి సంచలనంగా మారాయి.

తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో సీఎం అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే వస్తోంది.పార్టీలో తాను సీనియర్ నాయకుడిని అని, తమకే సీఎంగా అర్హత ఉందని , అప్పుడే ప్రకటనలు చేస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy )తానే సీఎంను అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావించేవారు.
ఇక కొద్ది రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను ఎప్పటికైనా సీఎంను అవుతానంటూ ప్రకటించారు.తాను సీఎం అభ్యర్థిని కాబట్టి తనను జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
ఇక భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు .దీంతో ఆయన కూడా తాను సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు.నిన్న నల్గొండ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తాను సీఎం అవుతానని ప్రకటించారు.అంతేకాదు నల్గొండ నుంచి ఒకరు సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు.
ఇక కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇదేవిధంగా వ్యాఖ్యానించారు.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని, ఎల్బీ స్టేడియం లో సీఎం గా తాను ప్రమాణ స్వీకారం ఉండబోతుందని, కాబట్టి అందరూ రావాలంటూ ముందుగానే ఆయన విజ్ఞప్తి చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka )దీనిపై స్పందించారు .సీఎం ఎవరు అనేది హై కమాండ్ నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.ఈ విధంగా సీనియర్ నాయకులంతా సందర్భం వచ్చినప్పుడల్లా, తామే సీఎం అంటూ ప్రకటించుకోవడం తో , ఇంకా ఎన్నికలే జరగలేదు ఫలితం ఏమిటో తెలియదు కానీ , సీఎం అభ్యర్థి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లో పోటీ నెలకొనడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.