కులమతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు జరుపుకునే పండగ దీపావళి.ఈ సీజన్ వచ్చిందంటే చాలు జనాల సంబరాలు అంబరాలు అంటుతాయి.
సత్యభామ నరకాసురుడుని ని వధించిన తర్వాత ఈ దీపావళి( Diwali ) సంబరాలను జరుపుకోవడం తరాల నుండి ఆనవాయితీగా వస్తుంది.దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తమ ఇళ్లలో దీపాలు వెలిగించి, టపాకాయలు కాలుస్తూ ఉంటారు.
అయితే టపాకాయలు కాల్చడం వల్ల కాలుష్యం ఎవ్వరూ ఊహించని స్థాయిలో పెరిగిపోతూ వస్తుంది.ప్రతీ ఏడాది దీపావళి తాలూకు ప్రభావం కాలుష్యం పై చాలా తీవ్రంగా పడుతుంది.
శబ్ద కాలుష్యం తో పాటుగా, వాయువు కూడా కాలుష్యం పరిమితి దాటి అవుతుండడం తో దీనికి చెక్ పెట్టాలని సుప్రీమ్ కోర్టు నిర్ణయం తీసుకుంది.గతం లో కూడా కాలుష్యం దృష్ట్యా ఫైర్ క్రాకర్స్ పై నిషేధం విధించాలని చర్చ వచ్చింది కానీ , సుప్రీమ్ కోర్టు( Supreme Court ) అందుకు అనుమతించలేదు.
కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఫైర్ క్రాకర్స్ ని కాల్చేందుకు అనుమతి లేదని, అది పూర్తిగా నిషిద్ధం అంటూ సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.అంటే ప్రతీ ఏడాది లాగ ఈ ఏడాది నుండి ఇక దీపావళి పండుగ వచ్చినప్పుడు మనం టపాకాయలు కాల్చుకోడానికి వీలు లేదు అన్నమాట.అయితే దీని మీద కొన్ని పరిమితులు పెడుతారా?, లేదా పూర్తిగా నిషేదిస్తారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.ఒకవేళ పరిమితులు విధిస్తే ఎక్కువ ధ్వని చేసే టపాకాయలు బ్యాన్ చేసే అవకాశం ఉంది.
అలాగే వాయువు ని విషపూరితం అధిక మోతాదు లో చేసే టపాకాయలు కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంది.సంపూర్ణంగా నిషేధం విధించడం కంటే, ఈ ఛాయస్ చాలా బెటర్ గా ఉంది కదా, మరి దీనిపై సుప్రీమ్ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మరోపక్క సుప్రీమ్ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్న దీపావళి పండుగ పై ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. విష వాయువులు విడుదల చేసే ఫ్యాక్టరీలపై నియంత్రణ ఉండదు, ఇప్పటికీ మురికి నీళ్లు త్రాగుతూ బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు , ఇలా కాలుష్యానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి.వీటి మీద ఇప్పటి వరకు సరైన కఠిన చర్యలు తీసుకోరు కానీ, ఏడాదికి ఒక్కసారి సరదాగా జరుపుకునే పండుగకి ఇన్ని ఆంక్షలా?, ఇదేమైనా న్యాయం గా ఉందా అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.