ఏపీలో దొంగ ఓట్ల కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పుకున్నారని తెలుస్తోంది.ఈ మేరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకున్నారు.
ఓటర్ల నమోదులో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సుప్రీంకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ధర్మాసనం ముందుకు పిటిషన్ వెళ్లింది.
అయితే గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసినందున కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే సీజేఐ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని జస్టిస్ బీఆర్ గవాయి రిజిస్ట్రీకి సూచించారు.