వీకెండ్ అయ్యింది అంటే థియేటర్స్ లో కొత్త సినిమాలతో పాటుగా , ఓటీటీ( OTT ) లో కూడా కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి.ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘జవాన్’( Jawan ).
ఏడాది ప్రారంభం లో పఠాన్ చిత్రం తో బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్న షారుఖ్ ఖాన్ సెకండ్ హాఫ్ లో కూడా ‘జవాన్’ చిత్రం తో అదే స్థాయి బ్లాక్ బస్టర్ ని కొట్టి వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని మరోసారి అందుకున్నాడు షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ).ఈ చిత్రాన్ని రీసెంట్ గానే అన్నీ ప్రాంతీయ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు.రెస్పాన్స్ అదిరిపోయింది కానీ, ఒక చిన్న సినిమా కారణంగా ఊహించిన రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకోలేకపోయింది ఈ చిత్రం.ఇది నిజంగా అందరికీ షాక్ కి గురి చేసిన విషయం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే మన టాలీవుడ్( Tollywood ) లో ఈ ఏడాది చిన్న సినిమాల హవా ఏ రేంజ్ లో కొనసాగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.గత ఏడాది స్టార్ హీరోల సినిమాలకు కాసుల కనకవర్షం కురిస్తే, ఈ ఏడాది చిన్న సినిమాలకు కాసుల కనకవర్షం కురిసింది.అలా ప్రమోషనల్ కంటెంట్ తో యూత్ ఆడియన్స్ ని విడుదలకు ముందే ఆకట్టుకున్న చిత్రం మ్యాడ్( Mad ).సంగీత్ శోభన్, నార్నె నవీన్( Sangeet Shobhan, Narne Naveen ) మరియు నితిన్ రామ్ హీరోలుగా నటించిన ఈ చిన్న చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించింది.కేవలం నాలుగు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం , ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది .రీసెంట్ గా ఈ సినిమాని కూడా నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేసారు.

థియేటర్స్ లో కంటే కూడా నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.జవాన్ ఒక్క హిందీ వెర్షన్ ని తప్ప, మిగతా అన్నీ వెర్షన్స్ ని అధిగమించి ఈ చిత్రం టాప్ 2 స్పాట్ లో ట్రెండ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమాని , సరిగ్గా పేర్లు కూడా తెలియని చిన్న హీరోల సినిమా డామినేట్ చేయడాన్ని చూస్తుంటే కంటెంట్ పవర్ ఎలాంటిదో అర్థం అవుతుంది.యూత్ ఆడియన్స్ ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం అంతలా ఎదురు చూసారు అన్నమాట.