తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు మరో 25 రోజుల్లో జరగబోతుంది.రాజకీయ పార్టీలు ఎవరి స్టైల్ లో వారు భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
తమ పార్టీల ఎజెండా మరియు మేనిఫెస్టో ని గడపగడపకి తీసుకెళ్తున్నారు.అయితే నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉంటుందని సర్వేలు తెలిపాయి.
కానీ ఇప్పుడు మాత్రం క్రమంగా లెక్కలు మారుతున్నాయి.మరోసారి అధికార బీఆర్ఎస్ పార్టీ ( BRS party )ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అంటూ సర్వేలు తేల్చి చెప్తున్నాయి.
కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల ప్రచారం ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని, రాబొయ్యే రోజుల్లో పార్టీ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.ప్రభుత్వ ఉద్యోగస్తులు తప్ప, అన్నీ వర్గాలు బీఆర్ఎస్ పార్టీ కి అనుకూలంగా ఉన్నారని, కచ్చితంగా గెలుపు తథ్యం అని అంటున్నారు.
దానికి తోడు కేసీఆర్ ప్రభుత్వం లో జరిగిన లోపాలను బహిరంగంగా జనాల ముందు ఒప్పుకోవడం.
ఎందుకు అలాంటి లోపాలు మరియు పొరపాట్లు వచ్చాయో జనాలకు వివరంగా అర్థం అయ్యేట్టు చెప్పడం, తదుపరి ఎన్నికలలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం లోకి వస్తే ఆ లోపాలను ఎలా సవరించుకుంటాము అనే దానిపై కేసీఆర్( CM KCR ) ఇస్తున్న వివరణ జనాలకు బాగా నచ్చింది.అందుకే ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.ఒక ప్రముఖ సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కి 70 నుండి 75 అసెంబ్లీ స్థానాలు వస్తాయట.
అలాగే కాంగ్రెస్ పార్టీ ( Congress party )కి 20 నుండి 25 స్థానాలు, మిగిలిన 19 స్థానాల్లో బీజేపీ – జనసేన మరియు .ఎంఐఎం పార్టీలు గెలుస్తాయని అంటున్నారు.
ఇదే కనుక జరిగితే తెలంగాణ లో వరుసగా మూడు సార్లు అధికారం లోకి వచ్చిన మొదటి మరియు చివరి రాజకీయ పార్టీ గా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర లో మిగిలిపోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇకపోతే ఈ ఎన్నికలకు తెలంగాణ ప్రాంతం లో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీ దూరం గా ఉంటున్న సంగతి తెలిసిందే.దీంతో తెలుగు దేశం పార్టీ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ లో దాదాపుగా విలీనం అయ్యిపోయినట్టే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అలాగే షర్మిల పార్టీ కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీ తో కలిసి పోటీ చేయబోతుంది.జనసేన పార్టీ కి తెలంగాణ లో ఉనికి ఉందో లేదో ఈ ఎన్నికలలో తెలియనుంది.