సాధారణంగా అరిటాకులను భోజనం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే ఈ మధ్యకాలంలో డెకరేషన్ కు కూడా అరిటాకులను తెగ వాడేస్తున్నారు.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అరిటాకుతో టీ తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. అరిటాకు టీ( Banana leaf tea ) వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే రోజు తాగేస్తారు.
మరి ఇంతకీ అరిటాకు టీ ఎలా తయారు చేసుకోవాలి.? అసలు దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక చిన్న అరిటాకును తీసుకుని శుభ్రంగా వాటర్ తో కడగాలి.
ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు అరిటాకు ముక్కలు వేసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Ginger ), చిటికెడు పసుపు వేసి మరొక మూడు నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన అరిటాకు టీ సిద్ధం అయినట్టే.ఈ అరిటాకు టీ రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.చాలామంది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటివారికి ఈ అరిటాకు టీ అద్భుతంగా సహాయపడుతుంది.రోజు ఖాళీ కడుపుతో ఈ అరిటాకు టీ తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.మలబద్ధకం పరార్ అవుతుంది.
అలాగే ఈ అరిటాకు టీలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మన ఇమ్యూనిటీ సిస్టం( Immune System )ను స్ట్రాంగ్ గా మారుస్తాయి.శరీరంలో క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

కొందరికి ఏమైనా గాయాలైతే ఓ పట్టాన మానవు.అయితే ఈ అరిటాకు టీ తీసుకోవడం వల్ల గాయాలు త్వరగా నయం అవుతాయి.అంతేకాదు అరిటాకు టీను నిత్యం తగితే శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థాలు బయటకు పోతాయి.అల్సర్ సమస్య ఉంటే దూరం అవుతుంది.ఈ చలికాలంలో ఎక్కువ శాతం మంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి( Sore throat ), గొంతు వాపు వంటి సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు.ఆయా సమస్యలకు చెక్ పెట్టడానికి సైతం అరిటాకు టీ తోడ్పడుతుంది.