ఎన్నికల నియమావళిని నిక్కచ్చిగా అమలు చేయాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాబోయో సాధారణ అసెంబ్లీ ఎన్నికలను సరైన ప్రణాళికతో పారదర్శకంగా, పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేయాలని, ప్రతి అధికారి,సిబ్బంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ పోలీస్ అధికారులతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు,చెక్ పోస్టులు, నామినేషన్ల కేంద్రాల వద్ద భద్రత, సంసిద్ధతపై సమీక్షించారు.

 Election Rules Should Be Strictly Enforced District Sp Akhil Mahajan, Election R-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…వచ్చే నెల 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.

పోలీస్ అధికారులంతా ఎన్నికల నియమావళికి లోబడి పనిచేయాలని,అధికారులు మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ లో గల అంశాలపై, ఎన్నికల బందోబస్తు, ఎన్నికల ప్రవర్తన పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

గత ఎన్నికల సంబంధిత నేర చరిత్ర ఉన్నవారు,రౌడి షీటర్లు,ఎన్నికలలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వారిని గుర్తించి బైండోవర్ చేయాలని ఆదేశించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మాధకద్రవ్యాలు ,మద్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

జిల్లా కు వచ్చిన కేంద్ర బలగాలతో క్రిటికల్ కేంద్రాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని అన్నారు.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి జిలాల్లో తనిఖీల్లో 43,33,475/- రూపాయలు,

1033.35 లీటర్ల మద్యం,9 కిలోల 450 గ్రాముల గంజాయి,1,37,035-/ రూపాయల ఓటర్లను ప్రలోభ పరిచే వస్తువులు సీజ్ చేయడం జరిగిందని, అదేవిధంగా జిల్లాలో 281 కేసులలో 785 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు.సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్ట్ ల వద్ద, జిల్లా పరిధిలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు రవాణా జరగకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ కు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచారి, రవికుమార్, సి.ఐ లు ఎస్.ఐ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube