తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లోనూ తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటిస్తామని గొప్పగా చెప్పిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party ) అధ్యక్షురాలు షర్మిలకు పెద్ద కష్టమే వచ్చి పడింది.పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువడం, కొంతమంది నేతలు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా, పార్టీ తరపున ఆర్థికంగా ఏ సహాయ సహకారాలు అందించే పరిస్థితి లేకపోవడం తదితర కారణాలతో చాలామంది నేతలు పోటీ చేయాలని ఉన్నా, వెనక్కి తగ్గుతున్నారు.
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడం, ప్రధాన పోటీ అంతా బిజెపి , కాంగ్రెస్ ల మధ్య అన్నట్టుగా పోటీ నెలకొనడంతో పోటీ చేసేందుకు నేతలు జంపుతున్నారు .దీంతో ఆ పార్టీ నుంచి షర్మిల ఒక్కరే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
పాలేరు అసెంబ్లీ కి తాను పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించారు.ఈ నెల నాలుగో తేదీన నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు.కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ), బి ఆర్ ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి( Kandala Upender Reddy ) పోటీలో ఉండడంతో, షర్మిల గెలుపు పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాకపోవడం , పాలేరు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉండడంతో షర్మిల పోటీ చేసిననా పెద్దగా ప్రయోజనం ఉండదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం తో షర్మిల ఆలోచనలో పడ్డారట .కానీ తెలంగాణలో పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎన్నికలకు ముందు , తరువాత అనేక అవమానాలు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో షర్మిల పోటీకి సిద్ధమవుతున్నారు.షర్మిల ( YS Sharmila )కోసం పనిచేస్తున్న ఆ పార్టీ నేత పిట్టా రామిరెడ్డి కొద్ది రోజులు క్రితం పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి 40 నందిని సమీకరించడం కష్టంగా మారిందట.దీంతో షర్మిల పార్టీ పరిస్థితి ఏమిటి అనేది అర్థం అయిపోతుంది.మొన్నటి వరకు తమ పార్టీలోకి బిఆర్ఎస్ , కాంగ్రెస్ ల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి చేరుతారని , అక్కడ టికెట్ దక్కని వారంతా ప్రత్యామ్నాయంగా తమ పార్టీ వైఫై చూస్తారని షర్మిల నమ్మకం పెట్టుకున్నారు.అయితే టికెట్ దక్కని వారు ఎవరు షర్మిల పార్టీ వైపు చూడకపోవడంతో, ఆ ఆశలు వదిలేసుకున్నారు.
ఇప్పుడు పాలేరు ఒక్క నియోజకవర్గం పైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నారు.