సౌత్ ఇండియన్ రెస్టారెంట్ నడుపుతున్న జపనీయులు.. ఆ విశేషాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

మన ఇండియన్ ఫుడ్స్( Indian Foods ) చాలా టేస్టీగా ఉంటాయి.ఇవి లెక్కలేనన్ని రుచులు అందిస్తాయి.

 The Japanese Who Run The South Indian Restaurant, Tadka, South Indian Food, Kyot-TeluguStop.com

అందుకే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ ఫుడ్స్ పాపులర్ అయ్యాయి.భారతీయులు చాలా దేశాలకు తిరుగుతూ విదేశీయులకు భారతీయ వంటకాల రుచి చూపించారు.

అప్పటినుంచి వారు ఇండియన్ ఫుడ్స్ ను వదలట్లేదు.ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉన్నా వెతుక్కుంటూ మరీ వెళ్లి తింటున్నారు.

అయితే విదేశాల్లో ఇండియన్ రెస్టారెంట్స్‌ ఇండియన్స్ ఒక్కరే నడుపుతారనుకుంటే పొరపాటు పడినట్లే.

జపాన్‌లోని క్యోటోలో( Kyoto, Japan ) ఒక భారతీయ రెస్టారెంట్ ఉంది.దీనిని తడ్కా( Tadka ) అని పిలుస్తారు, ఇది సౌత్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ అందిస్తుంది.తడ్కా ప్రత్యేకత ఏమిటంటే ఇది జపనీస్ ప్రజల సొంతం, దీనిని పూర్తిగా జపనీయులే రన్ చేస్తారు.

వారు వండి పెట్టేది ఇండియన్ ఫుడ్ డే కానీ వారి రెస్టారెంట్లో ఒక్క ఇండియన్ కూడా కనిపించడు.ఈ రెస్టారెంట్ నిర్వాహకులు దక్షిణ భారత వంటకాలను నేర్చుకోవడం, ప్రావీణ్యం పొందడం పట్ల మక్కువ చూపుతారు.

స్థానిక చెఫ్‌ల నుండి కొత్త వంటకాలను నేర్చుకునేందుకు వారు ప్రతి ఆరు నెలలకోసారి దక్షిణ భారతదేశంలోని చెన్నై నగరానికి వెళతారు.వారు వాటిని పూర్తి చేసి, వారి మెనూలో చేర్చుకునే వరకు వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తారు.

గోవా మాజీ ముఖ్యమంత్రి విధాన సలహాదారు ప్రసన్న కార్తీక్ తడ్కాను కనుగొన్నారు.తడ్కాను సందర్శించిన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎక్స్‌లో పంచుకున్నారు.అతను ఉండే రెస్టారెంట్ యొక్క చిత్రాలను పోస్ట్ చేశారు.ఫుడ్ క్వాలిటీ, టేస్ట్‌ను బాగా పొగిడారు.

“నేను జపాన్‌లోని క్యోటోలో తడ్కా అని పిలిచే ఈ సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌ని సందర్శించాను.తడ్కా జపనీయుల యాజమాన్యంలో ఉంది, దానిని వారే రన్ చేస్తున్నారు.ప్రతి 6 నెలలకు ఒకసారి చెన్నైని సందర్శించి, కొత్త వంటకాలు నేర్చుకుంటారు, దానిని పర్ఫెక్ట్ గా చేసేదాకా ప్రాక్టీస్ చేసి తర్వాత మెనూలో ఆ ఐటెం చేర్చుతారు.” అని కార్తీక్ వివరించారు.తడ్కా వద్ద ఉన్న ఆహారానికి అధిక రేటింగ్ కూడా ఇచ్చారు.ఇక్కడ చెన్నైలో చేసిన దోసె, ఇడ్లీ వలె చాలా టేస్టీగా ఉన్నాయని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube