రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు గనగోని శ్రీను ఆధ్వర్యంలో సుమారు 70 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలపై మొదటిగా ముఖ్యమంత్రి సంతకం పెడతారని ఈ సందర్భంగా వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సుడిది రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, ఎల్లారెడ్డిపేట మండల యూత్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్ ,చెన్ని బాబు,ఇమామ్, కొత్తపెళ్లి దేవయ్య, ఎస్.కె గఫర్ దేవయ్య,బుచ్చిలింగం సంతోష్ గౌడ్,పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గంట అంజయ్య,మానుక నాగరాజ్, బిపేట రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.