ప్రముఖ సినీ నటి శిల్పా శెట్టి ( Shilpa Shetty ) భర్త రాజ్ కుంద్రా( Raj Kundra ) బ్లూ ఫిలిమ్స్ చేశారు అని ఆరోపణలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసింది ఈ కేసులో భాగంగా ఈయన జైలు( Jail ) కు కూడా వెళ్లి వచ్చారు.ఇలా కొంత కాలం పాటు జైలు జీవితం అనుభవించినటువంటి ఈయన బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ తన మొహం చూపించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు.
దీంతో ఈయన బయటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మాస్క్ ద్వారా తన మొహం ఎవరికి కనపడకుండా బయట తిరిగేవారు అయితే ఇప్పుడిప్పుడే ఈయన ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చిందని తెలుస్తోంది.
ప్రస్తుతం రాజ్ కుంద్రా తిరిగి మామూలు మనిషి అవ్వడమే కాకుండా తన సినిమాల పైన అలాగే వ్యాపారాల పైన కూడా ఫోకస్ చేస్తున్నారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తాను జైలులో అనుభవించిన ఇబ్బందుల గురించి తెలియజేశారు.జైలులో చాలా నరకం అనుభవించానని జైలుకు వెళ్లిన మొదటి రోజే అందరి ముందు నా బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టారు.
ఏమైనా నిషేధిత పదార్థాలు తీసుకువచ్చారా అంటూ నన్ను చెక్ చేశారని ఆ క్షణమే నేను బ్రతికి ఉన్న చనిపోయిన ఫీలింగ్ తనకు కలిగిందని రాజ్ కుంద్రా తెలిపారు.
ఇన్ని రోజులపాటు తాను సినిమాల పరంగా వ్యాపారాల పరంగా ఎంతో సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు ఆ రోజుతో మట్టిలో కలిసిపోయాయని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధంగా జైలులో తాను ఎంతో నరకం అనుభవించగా బయట కూడా మీడియా వారికి ఇష్టం వచ్చిన విధంగా నా గురించి వార్తలను ప్రచారం చేశారనిరాజ్ కుంద్రా( Raj Kundra ) తెలిపారు.నా గురించి ఏవేవో తప్పుడు కథనాలు రాసి అందరి ముందు నా బట్టలు విప్పించేలా చేశారు.
ఇవన్నీ తలుచుకొని ఒకరోజు జైలులోనే చనిపోవాలని కూడా నిశ్చయించుకున్నానని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.కానీ ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదనే విషయం బయట పడుతుందన్న ధైర్యాన్ని నాకు నేను తెచ్చుకున్నానని ఈ సందర్భంగా రాజ్ కుంద్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.