రాజస్థాన్లో మరో నెలరోజుల వ్యవది లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇప్పుడు కాంగ్రెస్( Congress ) లోని కీలక నేతలు కేంద్రంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి దాడులు జరపటం సంచలనం గా మారింది .ఏకంగా సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గేహ్లాట్కు కూడా ఈడి నోటీసులు ఇచ్చింది ఆయన వ్యాపార సంస్థలలో కొన్ని ఇన్వెస్ట్మెంట్లు FEMA ( foreign exchange management act ) రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నందువల్లే నోటీసులు ఇచ్చినట్లుగా అధికారులు చెప్పుకొచ్చారు.
ఈనెల 27వ తారీఖున విచారణకు హాజరవ్వాల్సిందిగా వైభవ్ గెహ్లాట్ ( Vaibhav Gehlot )కు సూచించినట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా పేపర్ లీక్ కుంభకోణంలోని మనీ లాండరింగ్ వ్యవహారాలను విచారణ చేస్తున్నట్లుగా ప్రకటించిన ఈడి ఏకంగా ఒకేసారి ఏడు వేరువేరు ప్రాంతాల్లో సోదాలను నిర్వహించినట్లుగా తెలుస్తుంది.రాజస్థాన్లోని కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డో టా స్రా ( Gobind Singh Do Ta Sra ) తో పాటు మహువా ప్రాంతం నుంచి పోటీ కి రెఢీ అయిన మరో కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ఓటమి ఖాయం అయిపోవడంతోనే ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలా కేంద్ర విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్( Ashoka Gehlot ) తీవ్రంగా దుయ్యబట్టారు .ఇది బిజెపికి అలవాటు అయిన ఆట అని తమ ప్రత్యర్థులకు ఎర్ర గులాబీలు పంపించడం ఆ పార్టీకి చాలా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు.200 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాజస్థాన్లో వచ్చే నెల 25వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి.డిసెంబర్ మూడో తారీఖున ఫలితాలు వెల్లడవుతాయి .అయితే ఇలా ఎన్నికల సమయంలో దాడులు జరగటం లో రాజకీయ ప్రమేయం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.అయితే సాధారణ విచారణలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్లుగా అధికార పార్టీ సమర్థించుకుంటుంది.ఇక ముందు ముందు మరిన్ని సంచలన పరిణామాలు జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .