మేడిగడ్డ ప్రాజెక్టు భద్రతను పరిశీలించేందుకు కేంద్రం నియమించిన కమిటీ రేపు తెలంగాణకు రానుంది.ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ రేపు ప్రాజెక్టును సందర్శించి కేంద్రానికి నివేదిక అందించనుంది.మేడిగడ్డ డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర బృందాన్ని పంపాలని లేఖ రాశారు.
ప్రాజెక్టు డిజైన్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం వరకు తీసుకున్న నిర్ణయాలపై వాస్తవాలు తేల్చాలని కిషన్ రెడ్డి లేఖలో కోరిన సంగతి తెలిసిందే.దీంతో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్రం నిజాలను తేల్చేందుకు కమిటీని నియమించింది.
అయితే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.