రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత ? అక్కడ అభ్యర్థి ఆయనేనా ? 

మరికొద్ది సేపట్లో తెలంగాణ బిజెపి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.ఈ మేరకు బిజెపి( BJP ) జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో బిజెపి ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది.

 Rajasingh's Suspension Lifted Is He The Candidate There, Telangana Bjp, Goshama-TeluguStop.com

అలాగే కీలకమైన నియోజకవర్గాల్లో ఎవరెవరిని పోటీకి దించాలనే విషయంలో ఒక క్లారిటి వచ్చింది.ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్( Etela Rajender ) ను పోటీకి దించబోతున్నారు .ఇక చాలాకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( MLA Rajasingh )పై పార్టీ విధించిన సస్పెన్షన్ పైన బిజెపి అగ్ర నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారట.హిందుత్వం విషయంలో రాజాసింగ్ దూకుడుగా వ్యవహరిస్తున్నా,  ఆయన పార్టీకి కలిసి వచ్చే వ్యక్తి అని, ఆయన పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బిజెపి హై కమాండ్ పెద్దలు నిర్ణయించుకున్నారు .

Telugu Amith Sha, Bjp Mla Candi, Goshamahal, Goshamahal Mla, Modhi, Raja Singh,

ఇప్పటికే రెండు రోజులుగా ఢిల్లీలో( Delhi ) హై కమాండ్ పెద్దలతో తెలంగాణ బిజెపి నాయకులు చర్చలు జరుపుతున్నారు.అభ్యర్థుల జాబితాతో పాటు , ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు .ఈ సందర్భంగా రాజాసింగ్ సస్పెన్షన్ పైనా ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారట.గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ కు  పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.

  అయితే ఆయన దూకుడు చర్యలు కారణంగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.అయితే ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయం కావడం తో  రాజా సింగ్ పై  సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు , గోషామహల్ బిజెపి అభ్యర్థిగా ఆయనను ప్రకటించాలని నిర్ణయించుకున్నారట.

గత ఏడాది ఆగస్టులో స్టాండప్ కమెడియన్ మనోవర్ పార్క్ పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో రాజాసింగ్ బిజెపి సస్పెన్షన్ వేటు వేసింది .అయితే ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారట.  దీనిపై ఈ రోజే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube