Ravi Teja : టైగర్ నాగేశ్వరరావు సినిమాకు గాను రవితేజ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారో తెలుసా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Know Ravi Teja Remuneration For Tiger Nageswara Rao And Its Movie Budgets-TeluguStop.com

ఇటీవల ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఏప్రిల్ 7వ తేదీన రావణాసుర సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.ఈ సినిమా హిట్టు టాక్ ని సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా రవితేజ నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు.( Tiger nageswara rao )భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.

వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు.

Telugu Nupur Sanon, Ravi Teja, Tigernageswara, Tollywood-Movie

వాస్తవఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు వంశీ.ఇక ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది.మొదటి షో నుంచి టైగర్ నాగేశ్వరరావు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

ఒక దొంగ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు వంశీ.ఇకపోతే ఈ మూవీకి కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి.ఈ సినిమాలో రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ ముఖ్య పాత్రలు పోషించారు.ఇక ఈ సినిమాను దాదాపు 50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా కోసం రవితేజ భారీగానే రెమ్యునరేషన్ ( Remuneration )అందుకున్నడని తెలుస్తోంది.

Telugu Nupur Sanon, Ravi Teja, Tigernageswara, Tollywood-Movie

రవితేజ ఏకంగా 18 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం రవితేజ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే రవితేజ ఒకొక్క సినిమాకు 10 కోట్ల వరకు వసూల్ చేస్తున్నారట.

ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఏకంగా 18కోట్ల వరకు రెమ్యునరేషన్( ( Remuneration ) తీసుకున్నాడని టాక్.ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా మరిన్ని కలెక్షన్ లు సాధించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube