తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) దగ్గర పడుతూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.ఆల్రెడీ తొలివిడత అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది.
ఇదే సమయంలో ఆరు గ్యారెంటీ ల హామీలతో ప్రజలలోకి వెళ్తూ ఉంది.కాంగ్రెస్ పార్టీ( Congress Party )కి చెందిన జాతీయ నాయకుల సైతం తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
తాజాగా అక్టోబర్ 18వ తారీకు ములుగులో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించడం తెలిసిందే.ఈ సభలో రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆల్రెడీ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీని ఓడించడం జరిగింది.
ఇప్పుడు తెలంగాణలో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలలో కూడా బీజేపీని ఓడిస్తామని రాహుల్ గాంధీ( Rahul Gandhi ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం( KCR Government ) పై కూడా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
బీఆర్ఎస్( BRS ) అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగింది.
బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు.ధరణి పోర్టల్ లో అవినీతి జరిగిందని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ ప్రసంగించారు.