తెలంగాణలో కాంగ్రెస్ మరియు సీపీఐ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది.పొత్తుల్లో భాగంగా సీపీఐకి రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందని తెలుస్తోంది.
ఈ మేరకు సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం స్థానాలను ఇచ్చింది.ఈ విషయాన్ని సీపీఐ నాయకులు డి రాజా, నారాయణలకు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
ఈ క్రమంలోనే అటు సీపీఎంతోనూ కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోంది.అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా చెరో ఐదు సీట్లు కావాలని సీపీఐ, సీపీఎం అడిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సీపీఐకి రెండు సీట్లు ఇచ్చేందుకే మొగ్గు చూపిన కాంగ్రెస్ సీపీఎంకు కూడా రెండు స్థానాలను ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.కాగా సీపీఎం పార్టీకి ఇచ్చే స్థానాలపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.